Telangana

Smita : స్మితా సబర్వాల్ షాకింగ్ ట్వీట్.. ఆఫీసర్స్ లో టెన్షన్..!

Smita Sabharwal responded on her posting

Smita Sabharwal responded on her posting :  ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వర్గాలు, అధికార వర్గాల్లో ఒక అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సెక్రటేరియట్ లో ఎవరిని పలకరించినా ఆ అధికారి గురించే. ఆ అధికారే సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ఆమె భవిష్యత్ ఏంటనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం ఆమె సీఎంవోలోనే ఉన్నారు.

కలెక్టర్ గా ఆమె చేసిన సేవలను గుర్తించి సీఎంవోలోకి తీసుకుంటున్నట్టు స్వయంగా కేసీఆర్ చెప్పారు. కానీ ఆమెకు అత్యధిక ప్రాధాన్యం దక్కడంపై చాలామంది సీనియర్లు, తోటి ఐఏఎస్ లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఆమెపైనా పరోక్షంగా, ప్రత్యక్షంగా అనేక ఆరోపణలు చేశాయి.

smita sabharwal 1

ప్రస్తుతం రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) పైనా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆమె రాష్ట్రాన్ని వీడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె ముఖ్యమంత్రి కలవకపోవడానికి కారణం కూడా అదేనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు ఆమె  కేంద్ర సర్వీసులకు వెళ్తున్నట్టు, దాని కోసం కేంద్రానికి దరకాస్తు కూడా చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని కోసం తనకున్న పరిచయాలతో ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారంటూ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. ఇలా అనేకమంది ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఈ ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు స్మితా సబర్వాల్ (Smita Sabharwal). తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిగా తాను గర్విస్తున్నానని, తాను ఎక్కడికి వెళ్లడం లేదని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోనే పని చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు.

దీంతో ఆమెపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయ్యింది. అయితే గతంలో ఆమెపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు అధికారంలో ఉంది. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కు ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా తమకు నచ్చని అధికారులను లూప్ లైన్ లో పెట్టడం, అప్రధాన్య పోస్టులకు పంపడం చాలాకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు కీలకపోస్ట్ లో ఉన్న స్మితా సబర్వాల్ కూడా ఆ పరిస్థితులను ఎదుర్కోబోతున్నారా.? అనే ప్రశ్న కూడా వస్తున్నది.