Sonia Gandhi named as rajyasabha member : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు నేతలను ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy ) ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు పటాపంచలైపోయాయి. ఖమ్మం నుంచి సోనియగాంధీని లోక్ సభకు పంపాలని రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారని పార్టీలో చర్చ జరిగింది.
ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం విక్రమార్క భార్య(bhatti vikramarka), మంత్రులు పొంగులేటి సోదరుడు, తుమ్మల కుమారుడు, రేణుకా చౌదరి, మరికొందరు ఖమ్మం టికెట్ ఆశించారు. వీరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఏది ఏమైనా తనకు టికెట్ ఇవ్వాలని భట్టి విక్రమార్క భార్య పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంటి పోరు ఎక్కువ కావడంతో సోనియాగాంధీని (Sonia gandhi)ఖమ్మం నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని చూశారు. కానీ చివరి క్షణంలో ఏమయ్యిందో గానీ కాంగ్రెస్ తన నిర్ణయం మార్చుకుంది.
సోనియాగాంధీని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సోనియాగాంధీ(Sonia gandhi) పేరును కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఖమ్మం కాంగ్రెస్ నేతలు రిలాక్స్ అయ్యారు.
Read Also :