Chandra babu naidu escapes accident : తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో పాల్గొన్న చంద్రబాబును కలిసేందుకు పెద్ద ఎత్తున కేడర్ రావడంతో ఈ ఘటన జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు (Chandra babu) పాల్గొన్నారు. చివరలో ఆయను కలిసేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వేదికపైకి వచ్చారు. వేధికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో వెనకవైపు నుంచి నాయకులు తోసుకుంటూ వచ్చారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది.
సొలిగిన చంద్రబాబు#ChandrababuNaidu pic.twitter.com/3zrkfmVRVd
— batukamma.com (@batukammaweb) January 29, 2024
దీంతో చంద్రబాబునాయడు తూళి కింద పడబోయారు. పక్కనే ఉన్న గన్ మెన్ చంద్రబాబును పట్టుకున్నారు. వెంటనే నాయకులను గన్ మెన్లు పక్కకు తోసేసి చంద్రబాబుకు రక్షణగా ఉన్నారు. పడకుండా కాపాడారు.
Read Also :