T Congress master plan for parliament election : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ వ్యతిరేకత, అంతకుమించిన ప్రచారంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ (T Congress) విజయం సాధించింది. దానికోసం చాలా హామీలు ఇచ్చింది. వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ మరో ప్రయత్నాన్ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.
వాస్తవానికి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన క్రెడిట్ కేసీఆర్ (KCR)దే. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ పై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయాలనే ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు స్పష్టమౌతోంది. రాజకీయ నేపథ్యం ఉండొద్దని గతంలోనే బీఆర్ఎస్ సిఫార్సులను గవర్నర్ పక్కనపెట్టారు. అయినా కానీ టీజేఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను కాంగ్రెస్ (T Congress) ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆయన గతంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. గవర్నర్ వాటిని ఆమోదించారు.
ఈ ఎమ్మెల్సీ స్థానాలపై గతంలో బీఆర్ఎస్ నామినేట్ చేసిన అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టుకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం అవి ఆగిపోయియి. ఇప్పుడు దీన్ని బూచిగా చూపించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇందులో కాంగ్రెస్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయించడంలో బీజేపీ కూడా క్రీయాశీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
కోదండరాంకు ఎమ్మెల్సీపై స్టే రావడంతో.. ఇప్పుడు అంతా బీఆర్ఎస్, కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ కుట్ర చేసి ఆపారని స్వయంగా ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ నేతలు(T Congress), టీజేఎస్ (TJS) నేతలు ఇదే అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కోదండరాంకు పదవి రాకుండా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నాయని ప్రచారం చేస్తున్నారు. తద్వారా తెలంగాణ అనే పదానికి బీఆర్ఎస్ (BRS) ను దూరం చేయాలనేది వారి ప్లాన్ గా తెలుస్తోంది.
హిందూత్వానికి కేరాఫ్ గా ఉండే శివసేన మీద ఎలాగైతే బీజేపీ హిందూవ్యతిరేక ముద్ర వేసిందో.. అలాగే తెలంగాణను తెచ్చిన బీఆర్ఎస్ పై తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తాన్ని తమవైపు తిప్పుకోవడమే కాంగ్రెస్ ప్రణాళికగా తెలుస్తోంది. కేవలం కోదండరాంను బూచిగా చూపి ఇదంతా చేయాలనే ప్లాన్ ల ఉన్నట్టు సమాచారం.
కోర్టు కేసు, రాజకీయ నేపథ్యంతో ఇబ్బందిగా మారతాయని తెలిసినా.. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా ప్రకటన చేశారని అర్థమౌతోంది.
అయితే.. తెలంగాణ సమాజం ఇప్పటికీ కేసీఆర్ ను ఉద్యమనాయకుడిగానే చూస్తోంది. కోదండరాం జేఏసీ చైర్మన్ గా ఉన్నా.. ఉద్యమాన్ని ఉర్రూతలూగించి నడిపించింది మాత్రం కేసీఆరే. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పాచికలు ఏ మేరకు పారుతాయనేది వేచి చూడాలి.
Read Also :
- Panjagutta police : సంచలనం.. పంజాగుట్ట పీఎస్ మొత్తం ఊస్టింగ్..!
- Congress attack : గెట్ అవుట్.. ZPTCపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి చిందులు