Why special privilege for Contractors : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టేది బిల్డర్లు. వారికి స్పెషల్ ప్రివిలేజెస్ (special privilege)ఉండాలని మాట్లాడారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు అండగా ఉంటుందని చెప్పారు.
అయితే.. తెలంగాణలో అధికారంలోకి రాగానే చాలా చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ ఇప్పటి వరకు రైతుబంధు చాలామందికి రాలేదు. రుణమాఫీ కాలేదు. పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయి. రైతుభరోసా, రెట్టింపు పెన్షన్లు అని ఎన్నికల ముందుచెప్పిన మాటలు ఉత్తవే అయ్యాయి.
Read Also : హస్తంలో రగులుతున్న అగ్ని పర్వతం..!
దీంతో సోషల్ మీడియాలో సీఎంను చాలామంది ప్రశ్నిస్తున్నారు. దేశ సంస్కృతిని, సంప్రదాయాలను నిలబెట్టేది కాంట్రాక్టర్లు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ప్రివిలేజ్ (special privilege) ఉండాల్సింది కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కాదని.. రైతులకు ఉండాలని నాయిని అనురాగ్ రెడ్డి అనే యువకుడు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.
రేవంత్ రెడ్డి గారు..దేశ సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెట్టేది బిల్డర్లు, కాంట్రాక్టర్లు కాదు..అసలైన సాంప్రదాయాలను నిలబెట్టేది మన రైతన్నలు……మీరు అన్నట్టు స్పెషల్ ప్రివిలైజ్ ఉండాల్సింది బిల్డర్లు, కాంట్రాక్టర్లకు కాదు.. అన్నదాతలకు
As claimed below in the video,… pic.twitter.com/hmIDsKLckq
— Nayini Anurag Reddy (@NAR_Handle) January 29, 2024
రైతుబంధు రాక, పంటలకు నీళ్లందక రైతులు ఇబ్బంది పడుతోంటే బిల్డర్లకు స్పెషల్ ప్రివిలేట్ ఏంటీ అన్నట్టుగా మరికొందరు పోస్టులు పెట్టారు.