Telangana cabinet Internal war : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయ్యింది. 12మందితో కేబినెట్ కూర్పు జరిగింది. మరో 8 మందిని కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొత్తవారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కానీ దానికన్నా ఆసక్తికరమైన మరో అంశం తెరపైకి వచ్చింది.
అసలు ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఉన్న 12 మంది సరిగానే ఉన్నారా.? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో ఒకరంటే ఒకరికి పడటం లేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడాన్నే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ఒప్పుకోలేదు. అలాంటిది ముఖ్యమంత్రి అయ్యారంటే ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా.? ఎందుకంటే కాంగ్రెస్ లో సీఎం సీటు ఆశిస్తున్న వాళ్లంతా రేవంత్ రెడ్డి కంటే సీనియర్లే. అంతేకాదు.. కేబినెట్ పోర్ట్ ఫోలియోలపైనా మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ప్రచారం జరుగుతున్నట్టుగానే రెండు రోజుల క్రితం ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో వేదికపైనే ఇద్దరు మంత్రులు (Telangana cabinet) మాట్లాడారు. కోమటిరెడ్డి తాను కాంట్రాక్టర్లమేనని పొంగులేటి చెబితే.. తాను కాంట్రాక్టర్ ను కాదంటూ వేదికమీదే రిప్లై ఇచ్చారు. కోమటిరెడ్డి సమాధానంతో అంతా షాక్ అయ్యారు. వారి మధ్య సఖ్యత లేకుండా మరి ఇంత పబ్లిక్ గా తోటి మంత్రి మాటలకు కౌంటర్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మంత్రుల మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉంటే ఇలా జరిగి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందని మధ్య మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనే ప్రచారం కాంగ్రెస్ లో ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఖమ్మంలోనూ పాత కొత్త నేతల మధ్య దూరం చాలా పెరిగిందని అంటున్నారు. దీంతో ఎటు ఉండాలో తెలియక కేడర్ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి మీద కూడా కేబినెట్ (Telangana cabinet) సహచరులకు అంతగా పాజిటివ్ ఒపినియన్ లేదనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.
ఇంత జరుగుతున్నా అంతా ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే అనుమానం కలగొచ్చు. అయితే.. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు అధికారం వచ్చింది. అది కూడా కొద్ది సీట్ల మెజారిటీతోనే. కాబట్టి కొద్దిరోజులైనా సర్దుకుని పోతేనే పనులు జరుగుతాయనే భావనలో అంతా సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఏమాత్రం తోక జాడించినా తమ పనులు, కాంట్రాక్టులు అన్నీ అగిపోయే ప్రమాదం ఉండటంతోనే.. పరిస్థితి నిప్పుల కుంపటిలా ఉన్నా అందరు సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. కొందరు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిలా ఆవేశం పట్టలేక బరస్ట్ అవుతున్నారని కాంగ్రెస్ వాళ్లే మాట్లాడుకుంటున్నారు.