Telangana

Smita sabharwal : ఆ అధికారి ఔట్..! తెలంగాణ CMOలో కీలక మార్పులు..

Smita sabharwal post will filled with amrapali

Smita sabharwal post will filled with amrapali : తెలంగాణలో ప్రభుత్వ మార్పుతో పాటు అధికారవర్గాల్లోనూ మార్పులు భారీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకులు మారినప్పుడు ఖచ్చితంగా సీఎంవోలో ప్రక్షాళన జరుగుతుంది. తమకు నచ్చిన వారిని, అనుకూలంగా ఉండే వారిని సమర్థులనో.. మరో పేరుతోనో తెచ్చి సీఎంవోలో పెట్టుకుంటారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుధీర్భ కాలం పాటు సీఎంవోలో ఉన్న అధికారిణి స్మిత సబర్వాల్ (Smita sabharwal). అతిచిన్న వయసులో ఐఏఎస్ అయ్యారు. పలు ప్రాంతాల్లో పనిచేసిన ఆమె.. తెలంగాణలో పలు  జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. పని చేసిన ప్రతీచోట తనదైన మార్క్ చూపించారు.

Smita sabharwal 1

ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో నిక్కచ్చిగా ఉండే వారని పేరు. ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రసవాలు పెంచడం, ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ, సిజేరియన్లకు అడ్డుకట్టవేయడంలో కరీంనగర్ జిల్లాలో సమర్థవంతంగా పనిచేశారు.

ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఆమెను సీఎంవోలో అపాయింట్ చేశారు కేసీఆర్. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఆమె చాలా కాలం పాటు పనిచేశారు. సీఎంవోతో పాటు మిషన్ భగీరథ బాధ్యతలు కూడా చూశారామె. దీంతో ప్రతిపక్షాలు కూడా ఆమెపై చాలా సార్లు విమర్శలు చేశాయి. కొన్నిసార్లు అవి వ్యక్తిగత అంశాల వరకు వెళ్లాయి.

అయితే ప్రభుత్వం మారడానికి కొద్దిరోజుల ముందే ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ పదవీ విరమణ పొందారు. దీంతో ఆ శాఖ ఇంచార్జ్ బాధ్యతలు కూడా స్మితా సబర్వాల్ (Smita sabharwal)కే అప్పగించారు.

Smita sabharwal 2

కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సీఎంవోను దాదాపుగా ప్రక్షాళన చేశారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్మిత సబర్వాల్ మాత్రం కనిపించడం లేదు. చాలామంది ఐఏఎస్ అధికారులు కొత్త సీఎంను కలిశారు. కానీ స్మిత సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు కలిసినట్టుగా లేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలం పాటు పనిచేశారు కాబట్టి.. ప్రస్తుత ప్రభుత్వం ఆమెను కొనసాగించేందుకు ఆసక్తిగా కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఆమెపై చాలా విమర్శలు చేశారు.

అందుకే ఈ ప్రభుత్వానికి దూరంగా ఉండాలనే ఆమె డిసైడ్ అయ్యారా..? దీంతో ఆమె రాష్ట్ర సర్వీసుల్లో కొనసాగుతారా.? లేకపోతే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతారా..? అనే చర్చ మొదలైంది.

అయితే స్మితా సబర్వాల్ స్థానంలో సీఎంవోలోకి మరో యువ ఐఏఎస్ అధికారిణి కాట అమ్రపాలి (amrapali) వస్తారని తెలుస్తోంది. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, ఆ తర్వాత స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు.

Amrapali kata - batukamma

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ గా పనిచేశారు. డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో తన మిత్రుడు యువ ఐపీఎస్ అధికారిణి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2020 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Amrapali kata - batukamma 1

తాజానా అమ్రపాలి రాష్ట్ర సర్వీసులకు తిరిగివచ్చారు. సోమవారం రోజున సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు. దీంతో సీఎంలోకి రాబోతున్న మరో యంగ్ డైనమిన్ ఆఫీసర్ అమ్రపాలినే అనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం కూడా కలిసి వచ్చిందనే మాట వినిపిస్తోంది.

Read Also :