Telangana

Velugu : దొరకునా ఇటువంటి సేవా… జాకీలు పెట్టినా.. దొరకునా..!?

Velugu paper elevation to government 1

Velugu paper elevation to government : పాపం.. వెలుగు దినపత్రిక కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అధికార పార్టీ పత్రిక అని చెప్పుకోవడానికి, ఆ పేరు నిలుపుకోవడానికి నానా తంటాలు పడుతోంది. గతంలో అధికార పార్టీ ఏ చిన్న తప్పిదం చేసినా ఒంటికాలి మీద లేచిన ఈ పత్రిక.. ప్రస్తుత ప్రభుత్వాన్ని కాపాడేందుకు అదే కాళ్లతో, చేతులతో శాయశక్తులా ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వాలకుండా కాపలా కాస్తోంది.

అసలు విషయం ఏంటంటే..

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ కు చెందిన ఈ పత్రిక (Velugu paper) 11 డిసెంబర్ 2023 రోజున ఓ వార్తను బ్యానర్ ఐటంగా పబ్లిష్ చేసింది. “రాష్ట్ర ఖజానాలో పైసల్లేవ్” అనేది టైటిల్. కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా(ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇచ్చే పథకం)కు ఇప్పటికిప్పుడు రూ.11 వేల కోట్లు ఎట్లా.? ఉన్న పైసలన్నీ గత ప్రభుత్వమే ఖర్చు చేసింది. అని ఓ వార్తను గట్టిగానే వండివార్చింది. తన పైత్యం మొత్తం ఆ వార్తలో చూపించింది.

ఆశ్చర్యకరంగా అదే రోజున అంటే 11 డిసెంబర్ 2023 రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతుభరోసా (పాత రైతుబంధు) (rythubandhu) మీద రివ్యూ చేశారు. పాత విధానంలోనే అంటే ఎకరానికి ఏడాదికి రూ.10వేల చొప్పున రైతుల అకౌంట్లలో వేయాలని ఆదేశించారు. తాము ప్రకటించిన కొత్త స్కీంపై తర్వాత సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

దీంతో మరుసటి రోజు అంటే ఇవాళ 12 డిసెంబర్ 2023 రోజు అదే పేపర్ అదే బ్యానర్ వార్తగా “పెట్టుబడి సాయం రిలీజ్” అని టైటిల్ పెట్టి వార్త రాసింది.

 

అలా ఎలా సాధ్యం.. నిన్ననే కదా ఖజానాలో చిల్లీగవ్వ లేదని వార్త రాసినం. మరి ఇప్పుడు సీఎం రైతుబంధు వేస్తామని ప్రకటించారు. అంటే మనం రాసిన వార్త తప్పా.? ఖజానాలో డబ్బులు ఉన్నాయా..? గత సర్కారు మీద, ఆనాడు కొన్ని పత్రికల మీద ఎంత లాజికల్ గా ఆలోచించాం.. ఇప్పుడు కూడా అదే లాజిక్ లను ఎందుకు ఫాలో కావడం లేదు అనే విషయాలను ఆ పత్రిక (Velugu paper) ఆలోచించలేదు కావచ్చు. ఎందుకంటే అంతా స్క్రిప్టెట్ వ్యవహారం కదా..!

వెలుగు అసలు టార్గెట్ ఇదీ.

వాళ్ల అసలు లక్ష్యం వేరే ఉంది. ఆ లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా రీచ్ అయ్యారు. అది ఏంటంటే కొత్త ప్రభుత్వం మీద రైతుల్లో వ్యతిరేకత రాకుండా చూడటం. అందులో భాగంగానే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహారం నడిపించారు.

ఖజానాలో పైసల్లేవ్ అని వెలుగు దినపత్రిక వార్త రాస్తుంది.

ఆ రోజే సీఎం రివ్యూ చేస్తారు.

(వాస్తవానికి ప్రభుత్వంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు.)

ప్రస్తుతానికి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వలేం. పాత పద్దతిలోనే ఎకరానికి ఏడాదికి రూ.10వేల చొప్పున వేస్తాం. వెంటనే ఆ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటన చేస్తారు.

అదే వార్తను.. పైసల్లేవ్ అని ఏ ప్లేస్ లో అయితే తాటికాయంత అక్షరాలతో రాశారో.. అదే తాటికాయంత అక్షరాలతో రాసింది వెలుగు.

Velugu

అంటే..

“ఉన్న డబ్బులన్నీ కేసీఆర్ ప్రభుత్వం జేబులో వేసుకుని వెళ్లింది. ఇప్పుడు రైతుబంధుకు (rythubandhu) కూడా డబ్బులు లేకుండా చేసింది. రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వలేదు. అయినా కానీ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని రైతుబంధు ఇస్తామని ప్రకటించారు. ఇదీ రైతుల మీద అసలైన ప్రేమ. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో గ్యారంటీని నిలబెట్టుకున్నాం” అని సర్కారును వెనకేసుకురావడం.

“ఎకరానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇద్దామనుకున్నాం. కానీ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడం వల్ల ప్రస్తుతానికి పాత విధానంలో ఇస్తున్నాం..” అని కవరింగ్ చేసుకోవడం అన్నమాట.

గతంలో సర్కారును ఏ స్థాయిలో అయితే బద్నాం చేసిందో.. ఇప్పుడు అంతకు మించి కొత్త సర్కారు ఇమేజ్ ను పెంచేందుకు జాకీలు పెట్టి మరీ లేపుతోంది ఈ వెలుగు పత్రిక.

భవిష్యత్ లో ఇలాంటి జాకీ పెట్టే లేపే యవ్వారాలు ఎన్నెన్ని చూడాలో..!

Read Also :