Chair politics in Andhra Pradesh : ఏపీ రాజకీయాల్లో సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు సినిమాలు వచ్చాయి. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి నేపథ్యంలో కొన్ని, రాజధాని ఫైల్స్ అంటూ మరో సినిమా ఇలా చాలా సినిమాలే వచ్చాయి. పొలిటికల్ హీట్ ని మరింత పెంచాయి.
Read Also : Anchor indu : టాలెంట్ చూపించేస్తున్న యాంకర్ ఇందు..!
ఇప్పుడు సినిమా డైలాగులు కూడా ఏపీ పాలిటిక్స్ ని మరింత హీటెక్కిస్తున్నాయి. ఈ మధ్యే వచ్చిన గుంటూరు కారం సినిమాలో “ఆ కుర్చీని మడతపెట్టి… ” అనే సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందే ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే.. ఇప్పుడు అదే డైలాగును తమ ప్రచారంలో వాడుతూ ప్రజల్లో హుషారుపుట్టిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. గురువారం రోజు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇదే డైలాగ్ చెప్పారు. జగన్ రెడ్డి చొక్కా మడతపెడితే, తెలుగుతమ్ముళ్లు, ప్రజలు, జనసేన కార్యకర్తలు.. కుర్చీ మడతపెడతారంటూ వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు నోట కుర్చీ మడతపెట్టి డైలాగ్ pic.twitter.com/ILEar47dZD
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2024
శుక్రవారం రోజు ఆయన కుమారుడు లోకేష్ మరో అడుగు ముందుకు వెశారు. ఏకంగా సభలోకి ఓ మడత కుర్చీ పట్టుకొచ్చారు. ప్రసంగంలో మధ్యలో ఆ కుర్చీని మడతెట్టి మరీ చూపించారు. అయితే కుర్చీ మడతపెట్టి కొట్టడానికి కాదని(Chair politics ).. జగన్ కుర్చీ మడిచి ఇంటికి పంపించడానికి అని చెప్పుకొచ్చారు.
"నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే, మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం" నెల్లిమర్లలో, కుర్చీ మడత పెట్టి, జగన్ కి వార్నింగ్ ఇచ్చిన లోకేష్.. #Shankharavam#NaraLokesh#BabuSuper6 #AndhraPradesh pic.twitter.com/JwbFTMEur0
— Telugu Desam Party (@JaiTDP) February 16, 2024
దీంతో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కుర్చీ మడతపెట్టడం (Chair politics )చాలా ఫేమస్ అయిపోయింది.