Congress attack on brs leaders : కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశం వదలకుండా తమ కసి అంతా తీర్చుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు కూడా ఏమి అనలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు.
ఒకే రోజు ఇలాంటివి రెండు ఘటనలు జరిగాయి. భువనగిరి జిల్లాలో స్థానిక జెడ్పీ చైర్మన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati reddy venkatareddy) దాడి చేసినంత పనిచేశారు. చేయి పట్టి తోసేశారు(Congress attack). బయటకు ఈడ్చి పడేయండని పోలీసులను ఆదేశించారు. కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాగే.. రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొడతానని మంత్రి అనడంపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తర్వాత మాట్లాడిన మంత్రి….. జెడ్పీ చైర్మన్ తన తండ్రి పేరు చెప్పుకుని గెలిచారు తప్ప లేకుంటే సర్పంచ్ కూడా కాలేరని విమర్శలు చేశారు. దీంతో వివాదం మరింత పెద్దదైంది. జెడ్పీ చైర్మన్ ను పోలీసులు బయటకు లాక్కెళ్లే వరకు వచ్చింది.
మరోవైపు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (kavvampally satyanarayana).. స్థానిక జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ పై దుర్భాషలాడారు. గెట్ అవుట్ (Congress attack)అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్యసమావేశంలో వేదికపై జడ్పీటీసీ శేఖర్ గౌడ్ కు కుర్చీ వేయలేదు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీటీసీ, మరికొందరు సభ్యులు ప్రయత్నం చేశారు. వారి మాటలు పట్టించుకోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇది మీ పాలన కాదు.. మీ ఇష్టం ఉంటే కింద కూర్చోండి.. లేదంటే గెట్ అవుట్.. అంటూ హెచ్చరించారు. వివాదం మరింత ముదరడంతో పోలీసులు వచ్చి జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ ను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
Read Also :
- Why Contractors : కాంట్రాక్టర్ల మీద అంత ప్రేమెందుకు.?
- Chandra babu : తోసుకొచ్చిన కేడర్.. సొలిగిన చంద్రబాబు..!