Telangana

Free bus for women : మంచిదే.. కానీ దీని సంగతేంటీ.?

Free bus for women is good of bad

Free bus for women is good of bad : పొద్దున ఫేస్ బుక్ చూస్తోంటే ఓ పోస్ట్ కనిపించింది. సరే ఈ పోస్ట్ పెడితే ఈ వెబ్ సైట్ పైనా సోకాల్డ్ మేధావులు “బానిస” అనే ముద్ర వేస్తారు. కానీ.. కొన్ని విషయాలు పది మందికి తెలియాలి. వాస్తవం ఏంటనేది అందరూ ఆలోచించాలి. అందుకే ఇలాంటివి పబ్లిష్ చేయక తప్పదు.

ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చదవండి. మిగతాది ఈ పోస్ట్ కింద చర్చించుకుందాం.

 

“తెలంగాణ లో ఎక్కడి నుండి ఎక్కడి వరకైనా మహిళలు ప్రయాణించవచ్చు…

కార్లు ఉన్న వాళ్ళు ఎక్కొచ్చు, 20+ ఎకరాలు పైన భూమీ ఉన్న వాళ్ళు ఎక్కోచ్చు..

10 మందికి జీతాలిచ్చే వాళ్ళు ఎక్కొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కొచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కొచ్చు..

ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగులు రోజు ప్రయాణిస్తారు ..

రోజుకు ఒక ఉద్యోగి కనీసం 60 km ప్రయాణించిన 150/- రూపాయిలు అనుకుందాం.

నెలకు 20 పని దినాలు అయిన 150× 20 = 3000/-

నెలకు 3000 × 12 నెలలు = 36000/-

నెలకు 50000/-  పైన జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 36000/- లబ్ధి జరిగితే ప్రశ్నించే గొంతులకు తప్పు కనపడటం లేదు.

కానీ….

సంవత్సరానికి రెండసార్లు రైతు బంధు 5+ ఎకరాలు ఉన్న రైతన్నలకు ఇస్తే తప్పు కనిపించింది.

అది కూడా 5% రైతులే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి  ఉన్న వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో…

ఇప్పుడు చెప్పండి ఎవరు దుబారా చేస్తున్నారు???

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంట సాయం చెస్తే దుబారా నా???

ఎలాంటి నిబంధనలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం దుబారా నా??”

 

Free bus for women is good of bad 1చదివారు కదా.

నాకు ఈ పోస్ట్ చూసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఇలాంటివి పెట్టడం కామనే కదా అనిపించింది. కానీ ఓ రైతుబిడ్డగా ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది.

ఎందుకంటే తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణలో రైతుల దుస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియంది కాదు. ఆత్మహత్యలు, కరెంట్ షాక్ చావులు, అప్పుల బాధలు, బ్యాంకుల వాళ్లు వచ్చి తలుపులు పీక్కుని పోవడాలు, కరెంటు వాడు వచ్చి స్టార్టర్ పీక్కోని పోవడం కామన్.

ఇలాంటి బాధల్లోంచి ఎంతో కొంత ఉపశమనం కల్పించేలా రైతుబంధు పెట్టిననాడు ఎన్ని విమర్శలు.? ఎన్ని ఆరోపణలు.?

ఆ తర్వాత దళితబంధు ప్రకటించిన నాడు అదే పరిస్థితి.

కానీ.. రైతుబంధు (rythubandhu), దళితబంధుకు(dalitha bandhu).. నేడు కొత్త ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం (Free bus for women) స్కీముకు చాలా తేడా ఉంది. నిజానికి బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించే వారు ఉద్యోగాలు చేసేవారే. చుట్టాల ఇళ్లకు ప్రతిరోజు అయితే వెళ్లరు కదా. అలాంటప్పుడు ఉద్యోగాలు చేసే వారు ఆ మాత్రం బస్సు చార్జీలను భరించలేరా.? అనేది అసలు ప్రశ్న.

హైదరాబాద్ లో తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు బస్సుల్లో ప్రయాణిస్తారు. రెండు వర్గాల్లోని ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది ఏం ఉండదు. అలాంటి వీళ్లు డబ్బులు పెట్టుకుని ప్రయాణించలేరా.?

సరే మీది మంచి ఉద్దేశమే అయినప్పుడు.. రైతుబంధు విషయంలో చెబుతున్న కండీషన్లు దీనికి ఎందుకు వర్తింపజేయకూడదు. దివ్యాంగ మహిళలు, చిరు ఉద్యోగినులు, కూలీలు.. ఇలా అల్పాదాయ వర్గాలకు మాత్రమే ఉచిత ప్రయాణం (Free bus for women) కల్పిస్తే.. అవసరం ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఆర్టీసీకి అనవసరపు భారం తగ్గుతుంది.

ఒక్కో మహిళ లెక్కన చూస్తే చాలా చిన్న అమౌంటే కావచ్చు. కానీ ఆర్టీసీకి వచ్చి రోజువారి ఆదాయంలో దాదాపు సగం ఆదాయం ఇప్పుడు తగ్గిపోనుంది. అది సర్కారు నుంచి ఆర్టీసీ అందాలి. అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం అని మొన్నటి దాకా ఇదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టింది. దుబారా ఖర్చులు ఎక్కువయ్యాయి అని విమర్శించింది. ఇప్పుడు వాళ్లే వచ్చి ఈ స్కీమును ప్రారంభించారు.

అంతేకాదు.. ఇది కేవలం ఆర్టీసీకి ఆర్థిక భారమే కాదు. హైదరాబాద్ మెట్రోకు (Hyderabad metro) ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తున్నది. బస్సుల్లో ఉచితం కావడంతో మహిళలు మెట్రో ఎక్కడం తగ్గించేశారు. అంటే ఒక్క నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు వ్యవస్థల ఆర్థిక మూలాలపై గొడ్డలి వేటు వేసినట్టుగా అయ్యింది.

Read Also :