Telangana

VELUGU PAPER : శభాష్ వెలుగు.. నమస్తేను మించిపోయినవ్..!

VELUGU PAPER ARTICLE ON STATE DEBTS

VELUGU PAPER ARTICLE ON STATE DEBTS : ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం.. అనేనానుడి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కు చెందిన మీడియా సంస్థ “వెలుగు”కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుక, ప్రజల పక్షం అని ముద్ర వేసుకుని గత సర్కారును అడుగడుగునా నిలదీసిందో.. సర్కారు తప్పులని తమ పత్రికలో పేజీలకు పేజీలు నింపిందో…  అదే పత్రిక ఇప్పుడు అవే తప్పుల నుంచి సర్కారును కాపాడే ప్రయత్నాన్ని నెత్తిన ఎత్తుకుంది. ఇన్ని రోజుల ప్రశ్నించే గొంతు ఇప్పుడు ప్రభుత్వానికి బాకాలా మారిపోయింది.

“వెలుగు దినపత్రికలో  (VELUGU PAPER)ఇవాళ (సోమవారం 11,2023) ఒక వార్త ప్రధాన బ్యానర్ గా ప్రచురించారు. అదేంటంటే రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు. ఇప్పుడు రైతుబంధు, రుణమాఫీ ఇలా గత ప్రభుత్వం ప్రకటించిన స్కీములే కాదు.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ఆరుగ్యారెంటీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు అని.. ఉన్న డబ్బులన్నీ  గత ప్రభుత్వమే ఖర్చు చేసేసింది.. అంతా బీఆర్ఎస్ సర్కారు పాపమే” అని రాసుకొచ్చింది.

అంటే ఈ వార్త ఉద్దేశమేంటీ అంటే.. ఎన్నికల టైంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. అసలే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అది తెలిసి కూడా అలవిగాని హామీలిచ్చింది కాంగ్రెస్. దానికి ఈ వెలుగు దినపత్రిక, వీ6 మీడియా వత్తాసు పలికింది. ఎందుకంటే తమ యజమాని అదే పార్టీలో ఉన్నాడు కాబట్టి.

కానీ ఇప్పుడు వ్యవహారం తమ దాకా వచ్చింది కదా. సో.. ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి. (డబ్బులు లేవనే విషయం ముందే తెలుసు) కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం, సాకు కావాలి కదా. ఆ.. సాకే ఈ వార్త అన్నట్టు.

VELUGU PAPER ARTICLE ON STATE DEBTS 11

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 2019లో ఇదే పత్రిక రాసిన వార్త

అందుకే “ఇష్టం లేక మూతి వంకర అన్నట్టు..” గత ప్రభుత్వం ఉన్న డబ్బులన్ని తమ జేబుల్లో వేసుకుని పోయింది. ఒక్క పైసా లేదు. ప్రజలారా ఇప్పుడు మేం ఎలా సంక్షేమ పథకాలు అమలు చేయాలి.? ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేయాలి.? అని వార్తలు రాసి ప్రజల దృష్టి అంతా గత ప్రభుత్వం మీదికి మళ్లించాలి. మాకు చేయాలనే మంచి మనసు ఉంది. కానీ గత ప్రభుత్వం డబ్బులన్నీ ఖాళీ చేసి పోవడం వల్లే ఏమీ చేయలేకపోతున్నామని కవర్ డ్రైవ్ చేయడం అన్నమాట.

వాస్తవానికి గత ప్రభుత్వం లెక్కకు మించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయబట్టే ఖజానా ఖాళీ అయ్యిందనే విషయం వాళ్లకూ తెలుసు. అయినా.. గత ప్రభుత్వం వంద ఇస్తే మేం 200 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు కవర్ డ్రైవ్ నడిపిస్తోంది.

ఈ కవర్ డ్రైవ్ ప్రభుత్వం ఏర్పడగానే మొదలైంది. ఏ గ్యారంటీ గురించి అడిగినా మంత్రులు చెబుతున్న మాట “మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాలి. రివ్యూ చేశాక చెబుతాం”. రైతుబంధు గురించి అడిగినే అదే సమాధానం, రైతు రుణమాఫీ గురించి అడిగినా అదే సమాధానం. బీసీ బంధు గురించి అడిగినా అదే సమాధానం. రైతుబంధు మీద అయితే కొత్త మంత్రి సీతక్క గారు వెటకారాలు చేసినా.. ఈ పత్రికకు కనిపించలేదు. ఇది మొదటి స్టేజ్ కవరింగ్.

రెండో స్టేజ్ లో ఇప్పుడు ప్రభుత్వ మీడియా సంస్థగా మారిన వెలుగు (VELUGU PAPER) రంగంలోకి దిగింది. రాష్ట్రం అప్పుల్లో ఉందని గతంలో ఇదే పత్రిక నానా యాగి చేసినా ఇప్పుడు మాత్రం పైసల్లేవు కాబట్టే స్కీముల అమలు ఆలస్యం అవుతోందని ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా గత పాలకుల పాపమే అంటూ ఇష్యూను డైవర్ట్ చేస్తోంది.

ఇప్పుడు మీడియా సంస్థ జనం గొంతుకా? ప్రశ్నించే గొంతుకా..? లేకపోతే ప్రభుత్వ బానిసా..? అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంపై ఇన్ని రోజులు ఈ పత్రిక నడిపిన క్యాంపెయినింగ్ ప్రజాక్షేమం కోసమా.? లేకపోతే తమ పార్టీని(గతంలో బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్)అధికారంలోకి తెచ్చుకోవడానికా..? అనేది కూడా ప్రజలు ఆలోచించాలి.

చివరగా..

రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు, లక్ష్యాలు  లేని మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు మన దగ్గర. వాళ్ల ట్రాప్ లో పడితే ఇక అంతే.

Read Also :