Andhra Pradesh

KCR lessons : ఏపీలో పొలిటికల్ హడావుడికే ఆయనే కారణమా..?

KCR lessons to YS Jagan

KCR lessons to YS Jagan : తెలంగాణలో ప్రస్తుతం ఓ అంశంపై చాలా చర్చ జరుగుతున్నది.

40 మంది ఎమ్మెల్యేలను మార్చాలని ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో సలహా ఇచ్చారట కదా.!

40 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది కదా..!

రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ గారు ఆ పని ఎందుకు చేయలేకపోయారు.?

ప్రజలకు కేసీఆర్ పై ప్రేమ ఉన్నా.. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లే ఓడిపోయారు.. అనే చర్చలు టీవీ డిబేట్లలోనే కాదు.. సామాన్య జనంలోనూ జరుగుతున్నాయి.

ఇవన్నీ కేసీఆర్ ఎందుకు పసిగట్టలేకపోయారనేది ఇప్పుడు అసలు ప్రశ్న.? అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అంశంపై బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించిన విషయం మాట్లాడుకుందాం. త్వరలో అంటే మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడ అభ్యర్థుల కసరత్తు తారాస్థాయికి చేరుకుంది. నేరుగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ఇంచార్జుల పేరుతో బాధ్యతలు అప్పగిస్తున్నారు వైఎస్ జగన్.

దీంతో తనకు మంగళగిరి టికెట్ ఎలాగూ రాదని ఫిక్స్ ఆయిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరికొందరు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

KCR lessons to YS Jagan

ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే.. ఏది ఏమైనా గెలిచే ఛాన్స్ ఉన్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. సిట్టింగ్ లు, సీనియర్లు.. అనే తేడా లేకుండా కేవలం గెలుపుగుర్రాలకే ఛాన్స్ అని ఇంటర్నల్ మీటింగుల్లో తేల్చేశారట.

సామాజిక, ఆర్థిక, ప్రజా బలం.. ఇలా అన్ని అంశాలు బేరీజు వేశాకే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు. దీంతో టికెట్ వచ్చే ఛాన్స్ లేదని ఫిక్స్ అయిన వాళ్లు వైసీపీ నుంచి ముల్లెమూట సర్దేసుకుంటున్నారని టాక్. మరికొన్ని రోజులు పోతే పార్టీ మారే వాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంటున్నారు.

అయితే.. యాజిటీజ్ తెలంగాణలోనూ ఇదే జరిగి ఉండేది. ఒకవేళ కేసీఆర్ 40 మందినో 50 మందినో సిట్టింగులను తీసేసి వారి స్థానంలో కొత్త వారిని పెడితే నూటికి నూరు శాతం ఇదే జరిగేది. అప్పటి దాకా అవినీతిపరులు, అక్రమార్కులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని  ముద్ర వేసిన ప్రతిపక్ష పార్టీలు వారిని చేర్చుకోవడానికి ఆబగా ఎదురుచూస్తున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యతిరేకత ఉన్నా.. దాన్ని ప్రభుత్వంపై వ్యతిరేకతగా చూపించి తమ పార్టీలోకి వచ్చాడు కాబట్టి ప్రజలపక్షాన ఉంటాడని చెప్పి అదే అభ్యర్థిని ప్రతిపక్ష పార్టీలు బరిలో దింపేవి. బీఆర్ఎస్ తీసేసినా వేరే పార్టీ నుంచి అతను అభ్యర్థి అవుతాడు. వెళ్తూ వెళ్తూ పార్టీపై ఆరోపణలు చేయడం కామన్. సో ఎన్నికల ముందు పార్టీని బ్యాడ్ చేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు.

కాబట్టి.. సిట్టింగులను మార్చేకంటే చేసిన అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగానే ఎన్నికలకు వెళ్దాం అని కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తోంది. అందుకే మరీ తప్పదనుకున్న ఆరేడు చోట్ల అభ్యర్థులను మార్చారు. అయితే అంతకు ముందు కూడా సిట్టింగులకే రాబోయే ఎన్నికల్లో సీట్లు అని చాలా సార్లు చెప్పారు. కాబట్టి అదే మాటకు కట్టుబడి కూడా అభ్యర్థులను మార్చలేదంటున్నారు.

అయితే వైఎస్ జగన్ తెలంగాణ ఫలితాలను చూసి మరింత జాగ్రత్త పడ్డారట. అభ్యర్థుల విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెబుతున్నారట. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ బలం పెరిగింది. న్యూట్రల్ ఓటర్ కూడా చంద్రబాబు సానుభూతిపరుడిగా మారిపోయారు.

దీంతో ఈ సారి వైఎస్ జగన్ కు ఎన్నికలు కాస్త కష్టసాధ్యంగానే ఉన్నాయి. కాబట్టి టికెట్ల విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారట.  ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా దెబ్బతప్పదు.. అందుకే పోతే పోయారు.. అనుకుని గెలిచే అవకాశం లేని వారిని పక్కనపెట్టేస్తున్నారట. మొత్తానికి తెలంగాణ ఫలితం జగన్ కు గుణపాఠంగా మారిందనే చెప్పుకోవాలి.

Read Also :