Interesting post on kcr : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నారు. ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
కాంగ్రెస్ కావచ్చు.. బీజేపీ కావచ్చు.. మేధావులుగా చెప్పుకుంటూ కేసీఆర్ ని వ్యతిరేకించే ఓ వర్గం కావచ్చు… కేసీఆర్ (Interesting post on KCR) గారిని తూలనాడుతూ.. ఆయనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి గురించి ఏవైనా పాజిటివ్ పోస్టులు పెడితే వాటికింద తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.
కానీ ఇంతటి చెత్తలో కూడా ఓ పోస్ట్ నిజంగా ఆణిముత్యంలా కనిపించింది. రాజకీయాలతో సంబంధం లేకుండా.. ఒక మనిషిగా ఆలోచిస్తూ, మనం కూడా మనుషులుగానే ఆలోచించాలనే బాధ్యతను గుర్తు చేస్తూ హరి రాఘవ్ అనే ఓ సైకాలజిస్ట్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు.
“ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద జరగనంత ట్రోలింగ్ కెసిఆర్ మీద జరిగింది. కెసిఆర్ ని అభిమానించే వారికి ఇదేమీ కొత్త కాదు. ఉద్యమ సమయంలో అతనిని తిట్టని నోరు లేదన్నట్లుగా తిట్టేవారు. ఉరితీయాలని ఒకరంటే, చెట్టుకి కట్టేసి కొట్టాలని ఇంకొకరు అన్నారు. ఇప్పుడు జరుగుతున్న దానికి పదిరెట్లు ఎక్కువ ట్రోలింగ్ నడిచేది. ఆశ్చర్యంగా వారే కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఎక్కడ లేని ప్రేమను బహిరంగంగా ప్రదర్శించారు. అదంతా ఉద్యమ నేతగా అతని మీదున్న ద్వేషంగా భావించవచ్చు.
పెద్ద వయసు వచ్చిన వారు బాత్రూంలో జారి పడడం సహజం. మన కుటుంబాలలో అనేక మందికి ఇలా జరిగింది. భవిష్యత్తులో జరిగే అవకాశాలూ ఉన్నాయి. ఆ తరువాత వారి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. మనకు కూడా ఒక వయసు వచ్చాక అటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇటువంటి సందర్భంలో కూడ విషం చిమ్ముతున్నారంటే వారిని ఏమనుకోవాలి?
ప్రత్యర్థి పార్టీ హార్డ్ కోర్ ఫాన్స్ ఆ విధంగా ట్రోల్ చేసారంటే అర్థం చేసుకోవచ్చు. తరచూ మేము తటస్థం అంటూ ప్రకటించుకునే మేధావి వర్గం కూడా విషం చిమ్ముతున్నారంటే వారి మేధావితనం కేవలం ముసుగు అనే విషయం తేటతెల్లం అవుతుంది.
శత్రువయినా సరే హాస్పిటల్ పాలయినపుడు సంయమనం పాటించడం కనీస మానవ నైజం. భారతీయులలో అది ఎక్కువగా ఉంటుంది. భారతీయ పురాణాలలో అది కనిపిస్తుంది. అటువంటి పురాణాలను ఆదర్శాలుగా వర్ణిస్తూ భక్తి, స్పిరిట్యుయాలిటీ, మెడిటేషన్ భోదించే అనేక మంది ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని కెసిఆర్ మీద విషం చిమ్మడం కనిపించింది. ఇది చాలా బాధాకరం.
హాస్పటల్ పాలయినపుడు ఆ వ్యక్తి యొక్క విల్ పవర్ మాత్రమే ట్రీట్మెంట్ కి సహాయపడుతుంది. అది నేను నెలరోజులు డెత్ బెడ్ మీద ఉన్నపుడు నా జీవితంలో నిరూపణ అయ్యింది. అటువంటి విల్ పవర్ కెసిఆర్ కి (Interesting post on KCR) టన్నులలో ఉంది. ఆయన శరీరం ట్రీట్మెంట్ కి తప్పకుండ సహకరిస్తుంది. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తూ..
ఇది సాటి మనిషిగా స్పందిస్తూ చేసిన పోస్టు తప్ప రాజకీయా పోస్ట్ కాదని గమనించగలరు.”