Belt shops will be closed in telangana : తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైన అంశాల్లో బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. యువత పాడవుతున్నారంటూ మహిళలు చాలా సార్లు ఆందోళనలు చేశారు. బెల్ట్ షాపులపై దాడులు కూడా జరిగాయి. కానీ బీఆర్ఎస్ సర్కారు బెల్ట్ షాపుల మూసివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది.
ఇందుకు అనుగుణంగానే ప్రస్తుతం బెల్ట్ షాపుల మూసివేతపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు దీనికి సంబంధించిన పనిలో ఉన్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఒక్కో గ్రామంలో ఐదారు వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తంలో లక్షకు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని సమాచారం. వీటి లెక్కలన్నీ గతంలోనూ ఎక్సైజ్, పోలీసు శాఖ వారి దగ్గర ఉన్నా పెద్దగా వాటికి జోలికి వెళ్లలేదు. సర్కారు కూడా పెద్దగా వాటిని సీరియస్ గా తీసుకోకపోవడం, ఎక్సైజ్, పోలీసులకు బెల్ట్ షాపుల నుంచి లంచాలు రావడంతో వాళ్లు కూడా లైట్ తీసుకున్నారు. దీంతో లిక్కర్ బెల్ట్ దందా యధేచ్చగా కొనసాగింది.
ఇప్పుడు లిక్కర్ బెల్ట్ షాపులను బంద్ చేస్తే పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసినట్టుగా తెలుస్తోంది. బెల్ట్ షాపులను శాశ్వతంగా మూసివేసేలా చర్యలు ఉండేలా చూడాలని అధికారులకు చెప్పినట్టుగా సమాచారం.
నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టింది. అలాగే.. ప్రస్తుతం బెల్ట్ షాప్ లు నడిపిస్తే అదేవిధంగా కేసులు, పీడీ యాక్ట్ పెట్టాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
బెల్ట్ షాపులను మూసేస్తే లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలావరకు తగ్గిపోతుంది. అయినా సరే వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే.. వైన్స్ షాపుల దగ్గర పర్మిట్ రూములకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటనేది కూడా చర్చ జరుగుతోంది. వాటిని కూడా మూసేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ వైన్స్ ల పక్కనే పర్మిట్ రూములు ఉండటంతో చుట్టు పక్కల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బెల్ట్ షాపులతో పాటు, పర్మిట్ రూములను క్లోజ్ చేయాలనే డిమాండ్ కూడా వస్తోంది.
అయితే.. గతంలోనూ ప్రభుత్వాలు బెల్ట్ షాపులను మూసేస్తామని చెప్పినా అది పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏ మేరకు సఫలీకృతం అవుతుంది.? అసలు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో బెల్ట్ షాపుల బెండు తీస్తుందో చూడాలి.
Read Also :
- దొరకునా ఇటువంటి సేవా… జాకీలు పెట్టినా.. దొరకునా..!?
- VELUGU PAPER : శభాష్ వెలుగు.. నమస్తేను మించిపోయినవ్..!
- ఆ అధికారి ఔట్..! తెలంగాణ CMOలో కీలక మార్పులు..
- KCR lessons : ఏపీలో పొలిటికల్ హడావుడికే ఆయనే కారణమా..?
- ఈ సాహు మామూలోడు కాదు.. చుక్క చుక్కలోంచి..!
- Free bus for women : మంచిదే.. కానీ దీని సంగతేంటీ.?
- Interesting post on KCR : ట్రోలింగ్ చెత్త మధ్యలో ఓ ఆణిముత్యం ఇది
- Anasuya : హవ్వ… ఐ లవ్ యూ అనసూయ…!