Cinema

Samanthas TMP : సమంత కొత్త అవతారం.. సూపరెహే.!

Samanthas Tralala Moving Pictures : జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కుంటేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నటి సమంత. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. దాదాపుగా టాప్ హీరోలందరితో నటించింది. ఆడియన్స్ ను మెప్పించింది.

నాగచైతన్యతో వివాహం ఆ తర్వాత విడాకులు.. ఇలా తన జీవితంలో ఓ పెద్ద సమస్య వచ్చినా సమంత ఎక్కడా కుంగిపోలేదు. కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కే పరిమితమైనా ఫీనిక్స్ లా తిరిగి వచ్చింది. మళ్లీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. వరుస సినిమాలతో మరింత గ్లామర్ లో హల్చల్ తో చేస్తోంది.

ఈ బ్యూటీ ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు కేవలం నటిగానే ఉన్న సమంత ఇకపై ప్రొడ్యూసర్ కాబోతోంది. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్టు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. Tralala Moving Pictures పేరుతో హోం ప్రొడక్షన్‌ హౌస్‌ను  ప్రారంభించినట్టు వెల్లడించింది.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నా. సామాజిక అంశాలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించే, వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాం ఇది. చిత్రనిర్మాతలు అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వవ్యాప్తమైన కథలను చెప్పడానికి ఒక వేదిక. అని సామ్ చెప్పుకొచ్చింది.

Samanthas Tralala Moving Pictures 1

మూవీ లవర్స్ కి కొత్త తరం ఆలోచనలు, భావోద్వేగాలను ప్రతిబింబించే కంటెంట్ ఇవ్వడమే లక్ష్యంగా Tralala Moving Pictures స్థాపించానని సామ్ అంటోంది.

Read Also :