Cinema

Salaar : అదిరిపోయే న్యూస్ చెప్పిన సలార్ టీం..!

Salaar second trailer

Salaar second trailer : దేశ వ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ కి ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మూవీ సలార్ (Salaar).

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తోంది. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకొస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన సలార్(Salaar) ఫస్ట్ ట్రైలర్ రికార్డులను తిరగరాసింది. ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. దీంతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సలార్ టీం రెడీ అవుతోంది. ఒకట్రెండు రోజుల్లో సలార్ ట్రైలర్ విడుదల చేసేందుకు టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఫస్ట్ ట్రైలర్ లో ప్రభాస్, పృథ్విరాజ్ మధ్య స్నేహాన్ని ఎక్కువగా చూపించారు. రెండో ట్రైలర్ లో ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా  మారింది. ఈ నెల 22న ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పై అలరించబోతోంది.

Read Also :