BRS party backstabbers : తెలంగాణలో కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి పదిరోజులు కూడా కాలేదు. కానీ చాలా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ పరిణామాలు కేసీఆర్ కు కూడా షాకింగేనని చెప్పాలి.
ఎందుకంటే కేసీఆర్ (kcr) కు గురించి అంతా ఒక మాట చెబుతుంటారు. ఆయనకు ఏది అనిపిస్తే అది చేస్తారు. ఆయనకు నచ్చినవారిని నెత్తినపెట్టుకుంటారు. నచ్చని పనులు చేస్తే మళ్లీ కనుచూపుమేరలో కనబడనివ్వరు అని. అదే ఆయనకు చాలా చేటు చేసిందనేమాట సన్నిహితులు మొదటి నుంచిచెబుతూ ఉంటారు.
ఇప్పుడు దాని పర్యావసనాలు బయటపడుతున్నాయి. ఆయన నా వాళ్లు అనుకుని చేరదీసి కీలకబాధ్యతల్లో కూర్చోబెట్టినవారే నేడు ఆయనకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. పనిమంతులని పదవులు ఇస్తే ఇప్పుడు పూర్తిగా ఆయనపైనే తిరుగుబాటు మొదలుపెట్టారు. పుండుమీద కారం చల్లినట్టుగా మాట్లాడుతున్నారు. అవకాశం చూసుకుని గుంటనక్కలు కలుగుల్లోంచి బయటకు వచ్చినట్టు.. కేసీఆర్ (BRS party) పదవి దిగిపోయారో లేదో ఒక్కొక్కరుగా తమ అసలురూపం చూపిస్తున్నారు.
వాళ్లంతా కేసీఆర్ కు దూరంగా ఉండేవాళ్లు కాదు. పొద్దునలేస్తే ఆయనతో ఉన్నవారే… కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పలుకులు పలుకుతున్నారు.
ఈ ఆర్టికల్ చూడండి.
ఇది రాసింది ఎవరో కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ఆయనకు చీఫ్ పీఆర్వోగా ఉన్న జ్వాలా నరసింహారావు. “విజయానికి తిరుగులేదు.. ఓటమి శాశ్వతం కాదు” అంటూ రాసుకొచ్చిన ఈ వ్యాసంలో రేవంత్ రెడ్డిపై ప్రశంసలే ఎక్కువగా ఉన్నియి. రేవంత్ రెడ్డికి ఓ లెవల్లో జాకీలు పెట్టి లేపారు. వేరేవాళ్లు ఇలా రాస్తే పెద్దగా చర్చించుకోవాల్సిన పనిలేదు. కానీ స్వయంగా గత ముఖ్యమంత్రి దగ్గర చీఫ్ పీఆర్వోగా పనిచేసిన వ్యక్తి.. పదవి దిగిపోయి నెల కూడా కాకముందే ఇలా మరో వ్యక్తిని పొగుడుతూ రాయడం వారి కప్పదాటుడు బుద్ధిని వ్యక్తపరుస్తోంది.
ఈ ఆర్టికల్ కూడా చూడండి.
దీని గురించి ఇప్పటికే గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం. స్వయంగా కేసీఆర్ గారు ఇచ్చిన కార్పొరేషన్ పదవిలో మొన్నటి దాకా సకల సౌకర్యాలు అనుభవించిన పిట్టల రవీందర్ అనే జర్నలిస్ట్ రాసింది ఇంది. ముదిరాజ్ లకు ప్రభుత్వం ఏమీ చేయలేదు. అందుకే ముదిరాజులు బీఆర్ఎస్ పక్షాన నిలవలేదు అన్నట్టుగా ఆయన రాసుకొచ్చారు.
ఇది కాస్త డిఫరెంట్ ఇష్యూ. పార్టీకి సంబంధించిన విషయం. కానీ ఓడిపోయి పార్టీ ఆవేధనలో ఉన్న సమయంలో మండలి వేదికగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీశాయి. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిపై బహిరంగంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబో ఆలోచించాలి.
ఇవి కేవలం 15 రోజుల వ్యవధిలో బయటకు వచ్చినవి మాత్రమే. మరికొద్ది రోజులు పోతే ఇంకెన్ని గోముఖవ్యాఘ్రాలు బయటకు వస్తాయో చూడాలి. కేసీఆర్ ఇచ్చిన చనువుతో పదవులు అనుభవించి, పైసలు సంపాదించుకుని ఇప్పుడు వీళ్లు వేస్తున్న రాళ్లు.. ఎవరి దగ్గర మెప్పు పొందడానికి..?
మళ్లీ కొత్త పాలకుల దగ్గర పదవులు పొందేందుకా..? లేకపోతే ఇలాంటోళ్లు కూడా ఉంటారని కేసీఆర్ గారిని జాగ్రత్తపరుస్తున్నారా..? అధికారంలో ఉన్నప్పుడు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇలా కేసీఆర్ గారికి సలహా ఇస్తున్నాం అంటే సరే. కానీ తమ తమ స్వార్థం కోసం చేస్తే మాత్రం కేసీఆర్ గారు ఇప్పటికైనా తన ఆస్థానాన్ని.. తన చుట్టూ ఉన్న వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే.
Read Also :
- జగన్ ముందస్తు మాటకు తెలంగాణకు లింకేంటి..?
- Smita : స్మితా సబర్వాల్ షాకింగ్ ట్వీట్.. ఆఫీసర్స్ లో టెన్షన్..!