Ys jagan on early polls : ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అటు తెలుగుదేశం పార్టీ, ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా కార్యక్షేత్రంలోకి దిగిపోయాయి. చేరికలు, జంపింగ్ లు కూడా మొదలయ్యాయి. పార్టీలు దాదాపుగా ప్రచారం కూడా మొదలెట్టేశాయి.
ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Ys jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముందుగానే జరిగే ఛాన్స్ ఉందంటూ బాంబ్ పేల్చారు. షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరగాలి. కానీ అంతకుముందే ఎన్నికలకు ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణులు సన్నద్ధమవ్వాలని జగన్ పిలుపునిచ్చారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం నిజంగానే ఉందా అనే చర్చ మొదలైంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరగాలంటే మార్చి ప్రారంభంలోనే దాదాపుగా షెడ్యూల్ వచ్చేస్తుంది. అంటే మధ్యలో మిగిలింది జనవరి, ఫిబ్రవరి. ముందస్తు ఎన్నికలు జరిగినా జనవరిలో షెడ్యూల్ వచ్చి ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.
ఇది ఇప్పుడు సాధ్యపడుతుందా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే కేవలం నెల, నెలన్నర గ్యాప్ లో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ కు తలకుమించిన భారం అవుతుంది. ఖర్చు కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి.. ఎలక్షన్ కమిషన్ అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి జగన్ (Ys jagan)ఎందుకు అలా అన్నారనేది మరో ప్రశ్న. అయితే.. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం వహించకుండా ఉండేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే మాట వినిపిస్తోంది.
తెలంగాణలోనూ అధికార పార్టీ కేడర్ ఇలా అంటీముట్టనట్టుగా, మజ్జుగా వ్యవహరించడం వల్లే ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందనే చర్చ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అలాంటి పరిస్థితి ఏపీలో రావొద్దని కేడర్ ను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయడంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
Read Also :