Cinema

Oh My Baby Song : కారం కాస్త ఎక్కువే అయినట్టుంది..!

Oh My Baby Song Promo

Oh My Baby Song Promo : మిల్క్ బాయ్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఇప్పటికే ఈ మూవీపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. మహేష్ బాబుతో శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ మూవీ మరింత హాట్ టాపిక్ అయ్యింది.

మహేష్ ఎనర్జీకి, శ్రీలీల ఎనర్జీ తోడైతే సినిమా వేరే లెవల్ ఉంటుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీకి సంబంధించి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం 30 నిమిషాల్లో లక్షా 50 వేల మంది చూశారు.

ఈ నెల 13న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.