Youth Suicides : యువత చావులకు ఉరితాళ్లు పేనుతున్నదెవరు.?

Youth Suicides- who is responsible

Youth Suicides- who is responsible : నిరుద్యోగం పేరుతో జరుగుతున్న ఆత్మహత్యలు నిజంగానే ఆత్మహత్యలా.? లేకపోతే కొందరు పనిగట్టుకుని చేస్తున్నా హత్యలా.? తమ తమ స్వార్థాల కోసం నిరుద్యోగం పేరుతో చేస్తున్న ఈ దారుణమారణకాండ (Youth Suicides) గురించి క్లుప్తంగా వివరించారు కవీందర్ రెడ్డి గారు.

“మార్కెట్లో ఎన్నో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. కావలసింది అవసరం. మనిషికి అవసరం ఉంటే చేస్తారు. లేదంటే ఉద్యోగాలు లేవు.. అని కోందండ రామ్, మురళిల దగ్గరికి వెళితే వాళ్ళు అదే ప్రచారం చేస్తారు.

డిగ్రీ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి.. అని అనుకోవడం అమాయకత్వం. ఇలాంటి వాళ్ళను సరిగ్గా గైడ్ చేయకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.

దేశంలో 50 వేల జీతం ప్రమాణంగా తీసుకుంటే oraganized సెక్టార్ లో యావరేజ్ సాలరీ 22500 మాత్రమే. అంటే ఈ యావరేజ్ సాలరీ ఆధారంగా ఉద్యోగాలను పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే సరి అయిన మార్గంలో నడుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్ సెక్టార్ లో టాప్ ఉద్యోగులను పరిగణలోకి తీసుకోకండి.

ఒక్క వాహన రంగంలో

  1. డ్రైవర్లు
  2. మెకానిక్స్
  3. సేల్స్ మాన్
  4. సర్వీస్ అడ్వైజర్స్
  5. ఇన్సూరెన్స్ అడ్వైజర్స్
  6. డెంటింగ్ అండ్ పెయింటింగ్
  7. యూజెడ్ కార్ ఎస్టిమేటర్స్
  8. ఫెయిల్డ్ వాహనాల రవాణా చేశేవాళ్ళు
  9. టైర్ల రిపేర్ టైర్ల మార్చడం
  10. టైర్ సేల్స్ అండ్ అడ్వైజర్స్
  11. పెట్రోల్ పంప్ సేల్స్ మెన్స్
  12. వెయింగ్ మెషిన్ వర్కర్లు
  13. బొర్ వెల్ వర్కర్లు
  14. జెసిబి ఆపరేటర్లు
  15. వాహనాల సర్వీసింగ్ సెంటర్లు
  16. బ్యాటరీ రిపేర్లు సర్వీస్ సేల్స్
  17. టు వీలర్ టాక్సీ లు
  18. వాహనాల ఎలక్ట్రికల్ వర్క్స్.
  19. సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకం కొనడం
  20. షో రూమ్ సిబ్బంది (రీసెప్షన్, అకౌంట్స్, హౌస్ కీపింగ్)

ఇవి నాకు వాహన రంగంలో ఉన్న ఉపాధి మార్గాలు. నాకు తెలియనివి ఇంకా ఉండొచ్చు.

కేవలం ప్రభుత్వం ఉద్యోగం వస్తేనే అది ఉద్యోగం అంటూ జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు ఇలాంటి మేధావులు కొందరు.

ఇలాంటి పిల్లల ఆత్మహత్యలకు (Youth Suicides) వీళ్ళ ప్రచారాలు కూడా ఒక కారణం అవుతున్నాయి.”

Read Also :