Government employees children to go govt schools : తెలంగాణలో రేవంత్ రెడ్డి (revanth reddy)సర్కారు ప్రతీ నిర్ణయం సంచలనమే అవుతోంది. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే ప్రగతిభవన్ ముందున్న గ్రిల్స్ తొలగించారు. ఆ తర్వాత ప్రజాదర్బార్ నిర్వహణ, తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఆపొద్దని ప్రకటన చేయడం.. ఇలా చాలా చెప్పారు. ఆచరణ పూర్తిస్థాయిలో లేకపోయినా.. ప్రకటనను మాత్రం జనంలోకి బాగా తీసుకెళ్లారు.
కొత్త ముఖ్యమంత్రి అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం మాత్రం జనంలోకి బాగా వెళ్లింది. ఇఫ్పుడు అలాంటి సంచలన నిర్ణయమం తీసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ నిర్ణయం నిజంగానే జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మందుముల పరమేశ్వర్ రెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేశారు.
ఇదుగోండి ఆ పోస్ట్.
దీని సారాంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులంతా (Government employees)తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలి. లేకపోతే ప్రపోషన్లు, ప్రభుత్వం నుంచి అందుకునే సదుపాయాలు గట్రా ఉండవు అని.
అయితే ప్రభుత్వం నిజంగానే దీనిపైవర్కౌట్ చేస్తోందా.? లేకపోతే ఆయన తన సొంత అభిప్రాయాన్ని పెట్టారా.? అనేది పక్కనపెడితే. ఇది మాత్రం నూటికి నూరుపాళ్లు మంచి నిర్ణయమే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగడం ఖాయం.
ఎందుకంటే ప్రభుత్వ టీచర్లుగా (Government employees)పనిచేస్తున్న వాళ్లంతా కూడా తమ పిల్లలను వేరే స్కూళ్లలో చదివిస్తున్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు సరిగా లేవనే కదా అర్థం. మరి వేలకు వేలు, లక్షల జీతాలు తీసుకునే టీచర్లు ఏం పనిచేస్తున్నట్టు లెక్క.?
అందుకే ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే (govt schools) వేయాలనే నిబంధన పెడితే స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెరుగుతాయి. టీచర్లు బాధ్యతగా మెలుగుతారు. విద్యా వ్యవస్థ మొత్తం గాడిన పడుతుంది. అప్పుడు పేదవాడు వాడు.. గొప్పవాడు అనే తేడా లేకుండా.. నాణ్యమైన విద్య అందుతుంది. ఉద్యోగఅవకాశాల్లో అంతా సమానంగా పోటీ పడే అవకాశం ఏర్పడుతుంది. సమసమాజ స్థాపన జరుగుతుంది.
Read Also :