Telangana

KCR HIP REPLACEMENT నిన్న ఆపరేషన్.. అప్పుడే ఎలా నడుస్తున్నారు..?

KCR WALKING AFTER HIP REPLACEMENT

KCR WALKING AFTER HIP REPLACEMENT : తుంటి ఎముక విరగడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR HIP REPLACEMENT) గారికి నిన్న సర్జరీ పూర్తయ్యింది. ఆయనకు తుంటిని సోమాజీగూడ యశోద హాస్పిటల్ డాక్టర్లు రిప్లేస్ చేశారు. నిన్న రాత్రే ఆయనను గదిలోకి షిఫ్ట్ చేశారు.

ఇవాళ ఆయనను డాక్టర్లు నడిపించారు. స్టాండ్ సాయంతో అలాగే ఇద్దరు సహాయకులు చెరోవైపు ఉండి డాక్టర్లు నడిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే శుక్రవారం ఆపరేషన్ (KCR HIP REPLACEMENT) పూర్తయితే శనివారమే ఆయన ఎలా నడిచారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎముకలు విరిగితే కనీసం 15 రోజుల నుంచి 30 రోజుల వరకు బెడ్ రెస్ట్ లోనే ఉండాలని డాక్టర్లు చెబుతారు. కానీ కేసీఆర్ ఇలా ఎలా నడిచారని అంతా చర్చించుకుంటున్నారు.

KCR WALKING AFTER HIP REPLACEMENT 1

సాధారణంగా హిప్ రిప్లేస్ మెంట్ (KCR HIP REPLACEMENT) చేసినప్పుడు మరుసటి రోజు నుంచే నడిపిస్తారు. స్టాండ్ సాయంతో మెల్లిమెల్లిగా నడిపిస్తారు. ఎందుకంటే తుంటి మొత్తాన్ని అంటే ఎముక మరియు గుండ్రటి లోతుగా ఉండి ఎముక ఇమిడే ప్రాంతం మొత్తాన్ని స్టీల్ తో చేసినది బిగిస్తారు. కాబట్టి పెద్దగా సమస్య ఉండదు.

కానీ తుంటిపై భారం పడకుండా చాలా జాగ్రత్తగా నడవాలని సలహా ఇస్తారు. బరువు ఎత్తడం, నేలపై కూర్చోవడం వంటివి చేయవద్దని సలహా ఇస్తారు. 15 రోజుల తర్వాత స్టాండ్ లేకుండా నడవొచ్చు. కానీ ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలి.