Chandra babu visited cyclone affected villages : ఆంధ్రప్రదేశ్ లోని తుఫాను ప్రభావి ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu) రెండోరోజు పర్యటిస్తున్నారు. తుఫాను (cyclone) వరద బాధితులను ఆయన పరామర్శించారు.
బాపట్లలోని (bapatla) జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు తలా రూ.25వేల తక్షణ సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు సరుకులు, నిత్యావసర వస్తువులు అందజేశారు.
తుఫాను బాధిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పట్టణం, రాజీవ్ కాలనీలో బాధిత ప్రజలను పరామర్శించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పి కొందరు కన్నీరు పెట్టుకున్నారు#CBNwithCycloneVictims… pic.twitter.com/2hPQ97KQw5
— Telugu Desam Party (@JaiTDP) December 9, 2023
తుఫాను వల్ల సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్లి ఏమైనా తెచ్చుకుందామంటే రోడ్డు సౌకర్యం కూడా లేకుండాపోయిందన్నారు.
వారి గోడు విన్న చంద్రబాబు నాయుడు (Chandra babu) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున కుటుంబానికి రూ.5వేల సాయం చేస్తున్నట్టు ప్రకటించారు.
Read Also :
నిన్న ఆపరేషన్.. అప్పుడే ఎలా నడుస్తున్నారు..?