Alla Ramakrishna Reddy resigned : ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు విధేయుడిగా పేరున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించింది ఈయనే.
సీఎం జగన్ కు సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. కానీ అలాంటి వ్యక్తి సడెన్ ఎందుకు రాజీనామా చేశారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన రాజీనామా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాన్ని కల్పిస్తుందోనని వైసీపీ టెన్షన్ పడుతోంది.
అయితే మంగళగిరి ఇంచార్జ్ గా మరో నాయకుడు చిరంజీవిని నియమించడంతోనే రామకృష్ణారెడ్డి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు రాజీనామా సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా రాసి.. స్పీకర్ కార్యాలయంలో అందజేశారు.
Read Also :
- ఈ సాహు మామూలోడు కాదు.. చుక్క చుక్కలోంచి..!
- VELUGU PAPER : శభాష్ వెలుగు.. నమస్తేను మించిపోయినవ్..!
- Free bus for women : మంచిదే.. కానీ దీని సంగతేంటీ.?
- Interesting post on KCR : ట్రోలింగ్ చెత్త మధ్యలో ఓ ఆణిముత్యం ఇది
- Desk Journalist : పేరు గొప్ప.. బతుకు దిబ్బ నౌకరి..!
- Anasuya : హవ్వ… ఐ లవ్ యూ అనసూయ…!