Telangana

Congress white paper : శ్వేతపత్రం అసలు రంగు బయటపడింది!?

Congress white paper - Now Free schemes for now

Congress white paper – No Free schemes for now : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. బుధవారం(డిసెంబర్ 20)రోజున శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపై సాయంత్రం వరకు సుధీర్భ చర్చ కూడా జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షలకోట్లకు పైగా అప్పులు చేసిందని శ్వేతపత్రం ద్వారా వెల్లడించింది అధికార కాంగ్రెస్ పార్టీ.

కానీ శ్వేతపత్రం (Congress white paper) అనే అర్థాన్నే కాంగ్రెస్ మార్చేసిందని విపక్షాలు, కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ కూడా లెక్కలతో సహా బయటపెట్టింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అయితే పాయింట్ టూ పాయింట్ లోపాలను ఎత్తిచూపారు. దీంతో లెక్కలు సరిచేసుకుంటామని, ఇది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చుకున్నారు.

ఇంతవరకు ఓకే.. కానీ శ్వేతపత్రంలో ఉన్న కొన్ని కీలక అంశాలను చాలామంది పట్టించుకోలేదు. కొన్ని షాకింగ్ విషయాలను దీనిద్వారా చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారంటీల పేరుతో అద్భుత సంక్షేమంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస పార్టీ.. అసలు సంక్షేమానికి ఎగనామం పెట్టబోతున్నట్టు చెప్పకనే చెప్పింది.

శ్వేతపత్రం తెలుగు వెర్షన్ 41వ పేజీ చివర నుంచి 42 పేజీ మొదటి పేరా వరకు పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది.

“సమాజంలోని పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, వృద్ధి పెరుగుదల కోసం చాలా తక్కువ ఆర్థిక వెసులుబాటు అందుబాటులో ఉంది” 

Congress white paper - Now Free schems for now  1

అని స్పష్టంగా వెల్లడించింది. అంటే గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, తాము ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు గానీ డబ్బులు లేవు అని క్లారిటీ ఇచ్చింది. డబ్బులు లేవు అంటే.. ప్రస్తుతానికి ఆయా స్కీములకు బ్రేకులు వేసినట్టే కదా.

ఇప్పటికే రైతుబంధు డబ్బులు వేస్తున్నామని ఈ నెల 11వ తేదీన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు కనీసం అర ఎకరం భూమి ఉన్నవాళ్లకు కూడా డబ్బులు జమకాలేదు. దీంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు.

దీనికి తోడు రుణమాఫీ, పెన్షన్లు, దళితబంధు వంటి స్కీములన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే మంగళం పాడినట్టేనని తెలుస్తోంది. తమ దగ్గర పైసా లేదని అసెంబ్లీలో అధికార పార్టీ పదే పదే చెప్పుకోవడాన్ని బట్టి చూస్తే ఇది రూఢీ అవుతోంది. డబ్బుల్లేవు కాబట్టే స్కీములు అమలు చేయడం లేదనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం పెట్టారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే తాము స్కీములన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చివరలో చెప్పుకొచ్చారు.

కానీ పరిస్థితులు చూస్తే మాత్రం అన్నింటికి పంగనామాలు పెట్టినట్టే కనిపిస్తోంది. రైతుబంధు విషయానికొస్తే గత ప్రభుత్వం గతేడాది డిసెంబర్ చివరి వారంలో రైతుబంధు డబ్బులు అకౌంట్లలో వేసింది. కానీ ఈ ప్రభుత్వం డిసెంబర్ 11నే డబ్బులు వేస్తున్నామని ప్రకటన చేసింది. కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు. పథకాలకు పంగనామాలు పెట్టబోతోందనడానికి ఇదే మచ్చుతునక.

Read Also :