Telangana

CM camp office : ముఖ్యమంత్రే కాదు.. ఆయన నివాసమూ మారుతోంది..!

CM camp office to be shifted to MCRHRD : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మారబోతోంది. చాలాకాలంగా హైదరాబాద్ బేగంపేటలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక అక్కడే ప్రగతిభవన్ పేరుతో విశాలమైన భవనాలు, ప్రాంగణాన్ని నిర్మించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. పదేళ్ల పాటు అక్కడి నుంచే కేసీఆర్ పరిపాలించారు.

అయితే.. కొద్దిరోజుల క్రితమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రగతిభవన్ పేరును మహాత్మాజ్యోతిబాపూలే ప్రజాభవన్ గా మార్చారు. అదే ప్రజల కోసమే పనిచేస్తుందని చెబుతూ వస్తోంది.

అందుకుక తగ్గట్టుగానే ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (CM camp office) కూడా బేగంపేట నుండి తరలిపోనున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ కు అది షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని (MCRHRD) ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 CM camp office to be shifted to MCRHRD 1

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి MCRHRD ప్రాంగణాన్ని పరిశీలించారు. క్యాంపు కార్యాలయం ఏర్పాటు కోసం చేయాల్సిన ఏర్పాట్లు, నిర్మాణాలపై అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ మార్పులు పూర్తైన వెంటనే అక్కడి నుంచి పాలన కొనసాగించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.

ఈ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. అందులో చాలా భవనాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని భవనాలు తీసుకుని వాటిలో క్యాంప్ ఆఫీస్ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం ప్రగతిభవన్ నిర్మించడం చాలా విమర్శలకు కారణమైంది. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందనే విమర్శలు.. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసింది. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే కొత్త భవనాన్ని పక్కనపెట్టి.. మరోచోట క్యాంప్ ఆఫీస్ ఏర్పాట్లు చేయడం మరింత ఆర్థికభారం తప్ప మరొకటి కాదనే విమర్శలు వస్తున్నాయి

Read Also :