Off Beat

Freebies : ఫ్రీ. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ… ఫ్రీ…………………………ఫ్రీ

Freebies disadvantages

Freebies disadvantages :

బస్సు ప్రయాణం

ఆటో చావుకొచ్చింది…

ఉచితం వ్యవస్థకు ఉరి అవుతోంది…

 

మహిళకు ప్రయాణం ఫ్రీ…

ఆటోవాడి నాశనం కూడా ఫ్రీ…

నిజమే ప్రభుత్వం పెంచే అప్పు కూడా జనాలకు ఫ్రీ…

 

అధికారం కోసం

ఉప్పుకారం తిన్న సంగతి మరచి

రాష్ట్రం ఆహాకారాలు పెట్టే

ఈ పథకాల ఆకారాలే సిగ్గుశరంలేని నాయకుల నటనాటకారాలు…

 

సమాజమనే గొర్రెలమందకు

నాయక వేటగాళ్ళ ఉచిత హామీల గాలం…

జనమనే గొర్రెలను నిలువునా అప్పుకొక్యానికి వేలాడదీసి వెళ్ళిపోయే అధికార చదరంగ మాయాజాలం…

 

బస్సు ఫీ… అంట

చదువు మాత్రం ఖరీదంట….

వాపునే బలమని నమ్మించే ఏనుగంత ఏవేవో హామీలంట…

బడ్జెట్ మాత్రం మావటికన్నా బక్కనంట..

బంగారు తెలంగాణ భవిష్యత్…

బిర్యానీ లేని బగారబోషాణమంట…

 

అడుగుకో మడుగంట…

గుంతల పూడికే కొత్త రోడ్డంట

ఇదే ఎన్నికల ఎత్తుగడంట

అడిగినోడికి బెదిరింపుల అంటు తప్పదంట

అకౌంట్లలో డబ్బులంట

ఆర్థిక వ్యవస్థ అద్వానమంట

ఆంధ్రా భవిష్యత్ అంతుచిక్కని అగమ్యగోచరమంట…

 

నాయకులారా….

మీ స్వార్థాలకై సమాజాన్ని చంపకండి…

మీరు మంచి చేయలేదంటే అది కూడా అబద్ధమే…

మంచి ఉంది చెడు ఎక్కువుంది

చెడు సమాజాన్ని చెడుగుడు ఆడగూడదు అన్నదే  నా అక్షరాల ఆవేదన ఘోష…

 

అభిరామ్ 9704153642

Read Also :