Revanthreddy :
మొన్నటి దాకా వేల ఎకరాలు అన్నరు..
ఐదు వందల ఎకరాలు కూడా సూపియ్యలేకపోయిన్రు.
325 సర్వే నంబర్ లో దళితుల భూముల కబ్జా అన్నరు
అదీ తేల్చలేదు..
45 ఎకరాలు మిస్సైనయ్.. కేసీఆర్ (kcr)కు నోటీసులు అన్నరు.
అదీ అత్తా పత్తా లేదు.
కేసీఆర్ ఫాంహౌస్ లో మూడెకరాల బావి అన్నరు..
అది 2014కు ముందే తవ్విన్రనేది బయటపడ్డది.
కాలువలతోని నీళ్లన్ని ఫాంహౌస్ కు పట్కపోయిండని.. కాళేశ్వరం కట్టినప్పటి నుండి చెప్తున్నరు.
ఆ ఊర్లల్ల కేసీఆర్ పొలమొక్కటే లేదు..
వేరే రైతుల వేల ఎకరాల పొలాలు ఉన్నయ్.
ఇప్పుడు కేసీఆర్ ఫాంహౌస్ కు కొండపోచమ్మ నుండి నీళ్లు అంటున్నరు..
..
నిజంగా పస ఉన్న వాదనలా.?
కేవలం డైవర్షన్ కోసం ఇస్తున్న స్టేట్ మెంట్లా.?
(ఈ మధ్యే నేను కూడా ఎర్రవల్లి భూముల దగ్గరకు వెళ్లి వచ్చాను. రైతులతో మాట్లాడాను. పాండురంగ చెరువు పక్కన రెండు షెడ్లు ఉన్నాయి. ఇవేంటని వారిని అడిగాను.
పాండురంగ చెరువులో మోటార్లు పెట్టి.. తమ పొలాలకు నీళ్లు ఇచ్చాడని 325 సర్వే నంబర్ లో ఉన్న దళిత రైతులు చెప్పారు. రాళ్లు, గుట్టలుగా ఉన్న భూమిని చదును చేసి నీటి సౌకర్యం కల్పించాడని చెప్పారు.)
కానీ ఇప్పుడు ప్రభుత్వాధినేత, ప్రభుత్వ ఛానల్ చెబుతున్నదేమో వేరుగా ఉన్నది.
నిజంగానే చెరువు నుండి నేరుగా కేసీఆర్ ఫాంహౌస్ కి నీళ్లు పోతూ ఉంటే..
మూడేళ్లుగా ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది.?
ఇప్పుడెందుకు ఆ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ?
రైతులకు నీళ్లు, కరెంటు ఇవ్వాలని గట్టిగా అడిగే సరికి.. కేసీఆర్ అక్రమంగా నీళ్లు వాడుతున్నాడని కొత్త అంశాన్ని ముంగటేశారు.!
దీనిని డైవర్షన్ గేమ్ అనకుండా ఇంకేం అనాలి.?
ఇప్పుడు కావాల్సినవి డైవర్షన్లు, యూటర్న్ లు కాదు..
గడ్డాలు, మీసాల మీద చర్చలు కాదు..
నెర్రెలిచ్చిన నేల దూప తీర్చేందుకు కాసింత తడి..
పొట్టకొచ్చి నిండు చూలాలిలా ఉన్న వరికి దోసెడు నీళ్లు..
డొక్క ఎండుతున్న రైతుకు బాసట..

