Farmers :
ఎల్ నినో (elnino)వచ్చింది..
పేదోళ్లు పొదుపు పాటించాలి.
నీళ్లు తక్కువ వాడాలి..
రైతులు పంటలు వేయొద్దు.
కరెంటు ఎక్కువ తక్కువ వాడొద్దని..
బాత్రూలలో ఏసీలు పెట్టుకుని..
అడుగు అడుగుకు జిగేల్ మనే లైట్లు పెట్టుకుని..
రోజుకు వేల యూనిట్ల కరెంటు వాడుకుంటూ..
వేల లీడర్ల నీళ్లు వాడుకుంటూ..
పూట పూటకు పంచభక్ష్యపరమాన్నాలు తినే..
సినిమాలోళ్లు, బడా బాబులు.. సలహాలు ఇస్తున్నరు.
అంతే..అంతే..
అన్నింటికి పేదోడు.. రైతే పొదుపు పాటించాలి..
కడుపు ఎండబెట్టుకోవాలి.. కడుపు ఎండి ఉరికొయ్యకు వేలాడాలి.
పొదువు మాటలు చెబుతున్న సిన్మాలోళ్లు..
అక్రమంగానో.. సక్రమంగానో సంపాదించిన లక్షల కోట్ల నుండి..
రైతులను, పేదలను ఆదుకునేందుకు ఎంతో కొంత ఇవ్వొచ్చు కదా.!
ఒక్కో సిన్మా స్టార్ ఒక్కో ఊరినో..మండలాన్నో దత్తత తీసుకోవచ్చు కదా.. ఎల్ నినోపోయేదాకా..
కానీ అది జరగదు..
ఉద్దెర ముచ్చట్లు మాత్రం చెప్పి పోతరు..
ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేస్తే.. రేపు సర్కారోళ్లు వాళ్ల సిన్మాలకు ట్యాక్స్ లు తగ్గిస్తరు.
టికెట్ రేట్లు పెంచుకుంటానికి పర్మీషన్ ఇస్తరు

