Andhra Pradesh

Cyclone tension : ఆంధ్రప్రదేశ్ కు దెబ్బ మీద దెబ్బ..!

Cyclone tension to andhrapradesh

Cyclone tension to andhrapradesh: ఆంధ్రప్రదేశ్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒక సమస్య నుంచి కోలుకోక ముందే మరో సమస్య దూసుకువస్తోంది. మిచౌంగ్ తుఫాను ఇటీవలే బీభత్సం సృష్టించిపోయింది. పంటనంతా నీళ్ల పాలు చేసింది. రైతన్నకు కన్నీటిని మిగిల్చిపోయింది.

తుఫాను (Cyclone tension) ప్రభావం తగ్గిపోవడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్లను బాగు చేసుకుంటున్నారు. రైతులు మిగిలిన కొద్దిపాటి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ లోపే మరో పిడుగులాంటి వార్త వచ్చింది. మరో తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకువస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది

ఈ నెల (డిసెంబర్) 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 18కి అల్పపీడంగా మారుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇది ప్రస్తుతం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపింది. ఈ అల్పపీడనం భారీ తుఫానుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం వలన ఈ నెల 21 నుంచి 25 వరకు వర్షాలు (Cyclone tension) పడతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

Read Also :