Andhra Pradesh

TDP BJP Fight : బాబుకు హ్యాండిచ్చిన మోడీ.. ట్విట్టర్ లో తన్నులాట..!

TDP, BJP Fight in Andhra Pradesh

TDP, BJP Fight in Andhra Pradesh : ఏపీ రాజకీయాలు నానాటికి ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటికే అప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ కూటమి మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. జంపింగ్ జపాంగ్స్ కూడా ఈ రెండు పార్టీల మధ్యే నడుస్తున్నాయి. టికెట్ వచ్చే అవకాశం లేదని క్లారిటీకి వచ్చేసిన చాలామంది ఫ్యాన్ ను వదిలేసి సైకిలెక్కుతున్నారు.

ఈ హోరా హోరీ పోరులో హస్తం, కమలం మాత్రం కనిపించడం లేదు. ఈ రెండు పార్టీలు సొంతంగా పోటీ చేస్తాయా.? వేరే పార్టీలతో పొత్తులో ఉంటాయా.? అనేది కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే జనసేన పార్టీ చంద్రబాబుతో చేతులు కలిపింది. చాలా రోజులుగా ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. మరోవైపు.. బీజేపీతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో (TDP, BJP)కలవడం లేదు.

అటు కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ ఊగిసలాటలోనే ఉంది. సోషల్ మీడియాలో మాత్రమే కాంగ్రెస్ హడావుడి కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు ఎయిర్ పోర్టులో డీకే శివకుమార్, చంద్రబాబు కలవడం రాజకీయాల్లో ఒకింత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయా అన్న ప్రచారం మొదలైంది. కానీ పార్టీలు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Read Also :V6 అన్నాదమ్ముల కొట్లాట..! ఎందుకో తెలుసా..?

ఈ గ్యాప్ లోనే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఏపీ కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే చంద్రబాబుతో కాంగ్రెస్ దోస్తీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది మరో ప్రశ్న.

ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నా బీజేపీ మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోది. కావాలనే బీజేపీ మౌనాన్ని వహిస్తోందనే మాట వినిపిస్తోంది. ఏపీలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కమలం పెద్దలు(TDP, BJP).. కొంత మేరకు జగన్ వైపే సానుకూలంగా ఉన్నారని అంటున్నారు.

టీడీపీ, కాంగ్రెస్ దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తున్న తరుణంలో తాము వైసీపీ వైపు ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు లాభం జరుగుతుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందనే వార్తలు కూడా వస్తున్నాయి. గత ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ జగన్ సఖ్యతతోనే ఉన్నారు. ఇకపై కూడా అదే కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది.

ఈ పరిణామాలతో ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ, తెలుగుదేశం (TDP, BJP)మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. రామమందిరాన్ని రాజకీయాల కోసం పబ్లిసిటీ చేసుకుంటున్నారని తెలుగుదేశం కార్యకర్తలు అంటోంటే.. దానికి బీజేపీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఎంత వరకు వెళ్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.