Cabinet fight between vinod and v6 vivek : రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోది. ఇప్పటికీ కొన్ని మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఆశావహులు క్యూ కడుతున్నారట. మాకే ఇవ్వాలంటే మాకే ఇవ్వాలని పట్టుబడుతున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
కేబినెట్ లో ఇప్పటికే 11 మందికి చోటు కల్పించారు. మరో ఏడుగురికి అవకాశం ఉంది. దీంతో ఈ ఏడుగురు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం పోటీ పడుతున్నవారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరేసి రెడ్లు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఒకే కులం మధ్య పోటీ ఓకే గానీ.. ఒకే ఇంట్లో ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో పోరు (Cabinet fight) నడుస్తోందని తెలుస్తోంది. బెల్లపంల్లి నుంచి గడ్డం వినోద్ గెలిచారు. చెన్నూరు నుంచి వీ6, వెలుగు మీడియా(v6, velugu) సంస్థల ఓనర్ వివేక్ (V6 vivek) గెలిచారు. దీంతో ఈ ఇద్దరు కూడా మంత్రి పదవుల కోసం అధిష్టానం దగ్గర తమ పరపతి మొత్తం వినియోగిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
నాకే ఇవ్వాలని వినోద్, నాకే ఇవ్వాలని వివేక్ పట్టుబడుతున్నారట. రాష్ట్రంలో పార్టీ కోసం తన మీడియా సంస్థలను ధారపోశాను. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా కాపాడుకొస్తున్నాను. అలాంటి నాకు ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇస్తే ఊరుకునేది లేదని ఆయన అంటున్నారట. మరోవైపు.. వినోద్ కూడా తాను సీనియర్ ను కాబట్టి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. గతంలో మంత్రిగా (Cabinet fight) పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మంత్రి పదవి తనకే ఇవ్వడమే కరెక్ట్ అని అంటున్నారట.
అలాగే.. వినోద్ దాదాపు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒకసారి బయటకు వచ్చినా కొద్దిరోజులకే తిరిగి వెళ్లిపోయారు. కానీ వివేక్ (V6 vivek) మాత్రం రెండు మూడు పార్టీలు తిరిగి. చివరకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనపై అధిష్టానం కూడా అంత సానుకూలంగా లేదనేది మరో వర్గం నుంచి వినిపిస్తున్న మాట.
కానీ వివేక్ మాత్రం మంత్రి పదవి విషయంలో(Cabinet fight) ఊరుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారట. అందుకే ఎక్కువసమయం ఢిల్లీలో గడుపుతున్నారని టాక్. ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని తనవైపు తిప్పుకునుందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అటువైపు నుంచి కాస్త నెగెటివ్ సంకేతాలు రావడంతోనే.. ఇటీవల వెలుగు దినపత్రికలో, వీ6లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రసారమైనట్టు సమాచారం. మళ్లీ అంతా సెట్ రైట్ కావడంతో ఇప్పుడు వ్యతిరేక ఉధృతిని ఆ మీడియా సంస్థలు కాస్త తగ్గించినట్టుగా చెబుతున్నారు.