V6 VIVEK : సొంత జిల్లాకు వెళ్లాలంటే భయపడుతున్న మంత్రి..?

v6 vivek versus pramsagar rao in mancherial

V6 VIVEK : మంచిర్యాల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది. సొంత జిల్లా అయిన మంచిర్యాలో కనీసం జెంగా ఎగరవేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందట.

దీనికి కారణం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో(premsagar rao) ఉన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. చెన్నూరు టికెట్ వివేక్(v6 vivek) కు ఇచ్చినప్పటి నుండి ప్రేమ్ సాగర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఆ తర్వాత మంత్రి పదవి అయినా తనకు ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ వివేక్ లాబీయింగ్ తో ప్రేమ్ సాగర్ రావును పార్టీ పక్కన పెట్టేసింది. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుండి ప్రేమ్ సాగర్ రావు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఇప్పుడు సెప్టెంబర్ 17న జెండా ఎగరేయాల్సి ఉంది. దీంతో మరోసారి ఇద్దరి మధ్య పోరు పీక్స్ లోకి చేరింది.

సాధారణంగా సొంత జిల్లాలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ జెండా ఎగరవేసే అవకాశం కల్పిస్తారు. మంచిర్యాల జిల్లాలో ఏకైక మంత్రిగా వివేక్ (minister vivek)ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆగస్టు 15న వేరే జిల్లాలో జెండావిష్కరణ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు కూడా.. సెప్టెంబర్ 17కు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న మెదక్ జిల్లాలో జాతీయ జెండా ఎగురవేయాలంటూ.. చీఫ్ సెక్రటరీ నుండి ఆదేశాలు వచ్చాయి.

మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుని నిరాశకు గురైన ప్రేమ్ సాగర్ రావు.. ఆగ్రహంతోనే వివేక్ ను మెదక్ జిల్లాకు పంపించినట్టు తెలుస్తోంది. వివేక్ ను మంచిర్యాలలో అడుగుపెట్టనిచ్చేది లేదని ప్రేమ్ సాగర్ రావు వర్గం అంటోంది.

దీంతో వివేక్ తో మంచిర్యాలలో జెండా ఎగరేయనిస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయోనని భావించిన అధిష్టానం.. మెదక్ కు పంపినట్టుగా పార్టీలోనే చర్చ జరుగుతోంది.

Read Also :

ఇప్పటికే వివేక్ మంచిర్యాల వచ్చినా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.  చెన్నూరు ఎమ్మెల్యే అయిన వివేక్.. మంచిర్యాలలో మకాం పెట్టి.. కేడర్ మెత్తాన్నితనవైపు తిప్పుకుంటున్నారని ప్రేమ్ సాగర్ రావు వర్గం ఆగ్రహంతో ఉంది.

రెండు మూడు పార్టీలు మారిన వ్యక్తి వచ్చిఇప్పుడు పెత్తనం చేయడం ఏంటని వారంతా మండిపడుతున్నారు. అధికారంలో లేకున్నా పార్టీ వెంటే ఉన్న ప్రేమ్ సాగర్ రావును కాదని అన్ని రకాలుగా వివేక్ కే పార్టీ సాయపడుతోందని, పదవులు వారికే ఇస్తోందని ప్రేమ్ సాగర్ రావు వర్గం ముందు నుండి కోపంతో ఉంది.

అందుకే ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని వివేక్ తో మంచిర్యాలలో జెండా ఎగరేయనివ్వడం లేదని అంటున్నారు.