Amrapali : ఇంకా ఏపీలోనే అమ్రపాలి రెడ్డి..! ఎందుకు..?

Amrapali ias still in Ap cadre

Amrapali : గతంలో తెలంగాణలో పనిచేసి డైనమిక్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్న అమ్రపాలి రెడ్డి.. ఇంకా ఏపీలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆమెను తెలంగాణ నుండి ఏపీ క్యాడర్ కు పంపించారు.

ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(Central Administrative Tribunal)  ఆదేశాలిచ్చింది.

దీంతో ఆమె తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ  ఆంద్రప్రదేశ్ లోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆమె కనిపించారు. దీంతో ఆమె ఇంకా అక్కడే ఎందుకు ఉన్నారన్న చర్చ మొదలైంది.

Read Also : రాత్రి నుండి హాస్పిటల్స్ బంద్..!

2024 అక్టోబర్ లో ఆమె తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోయారు. ఈ ఏడాది జూన్ లో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులిచ్చింది.

గతంలో ఏపీ, తెలంగాణ కేడర్ లో ఉన్న పలువురు అధికారులను తెలంగాణ నుండి ఏపీకి పంపిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. అమ్రపాలి, రొనాల్డ్ రాస్..మరికొందరు అధికారులు తెలంగాణ నుండి ఏపీకి వెళ్లిపోయారు. కొందరు ఐపీఎస్ అధికారులను కూడా ఏపీ కేడర్ కు పంపించారు.

ఆమ్రపాలి కాటా 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్ అధికారిగా ఆమె ఉండేవారు. అయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. కానీ తాను తెలంగాణలోనే కొనసాగుతానని ఆమె క్యాట్ ను ఆశ్రయించారు.

Read Also : లవంగం తింటే తంబాకు అన్నరు:బండి సంజయ్

తన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తారని తనకు అక్కడే అవకాశం కల్పించాలని కోరారు. అయినా ఆమెను ఏపీకి పంపించారు. అక్కడ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు ఇచ్చారు.

తెలంగాణకు కేటాయిస్తూ జూన్ లోనే ఉత్తర్వులు వచ్చినా ఇంకా ఆమె రిలీవ్ కాలేదు.

గతంలో తెలంగాణలో కీలక పోస్టుల్లో ఆమె పనిచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు. అలాగే హెచ్ఎండీఏతో పాటు.. ఒకేసారి ఐదారు కీలక పదవులను నిర్వర్తించారు.

తెలంగాణకు కేటాయించిన తర్వాత కూడా ఆమె అక్కడే ఎందుకు ఆగిపోయారన్నది అంతుపట్టడం లేదు. దీని వెనకాల  ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. రకరకాల ప్రచారాలు కూడా  వినిపిస్తున్నాయి.

Read Also :