Honey Trap : సమాజంలో ఈజీ మనీకి అలవాటుపడుతున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. డబ్బున్నవాళ్లను వెతుక్కుని వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.
అయితే అక్రమ కార్యకలాపాలు ఎక్కువ రోజులు సాగవు కదా. ఏదో ఒక రోజు వారి పాపం పండుతుంది. చేవెళ్లలోనూ అలాంటి ఘటనే జరిగింది. రంగారెడ్డి అనే వ్యక్తి చేవెళ్లలో యోగా కేంద్రం నిర్వహిస్తుంటాడు.
Read Also : ఈ అందం వెనక ఇంత కథ ఉందా..?
అతని ఆర్థిక పరిస్థితిపై అమర్ అనే వ్యక్తి ఆరా తీశాడు. రంగారెడ్డి దగ్గర డబ్బులు బాగున్నాయని గుర్తించాడు. ఇద్దరు మహిళలతో కలిసి ఓ ప్లాన్ రెడీ చేశాడు.
రంగారెడ్డి యోగా గురువు కాబట్టి.. ఇద్దరు మహిళలను తమకు ఆరోగ్యం బాగోలేదని ఆయన దగ్గరకు పంపించాడు. వారు వెళ్లిందే దురుద్దేశంతో కాబట్టి.. వెళ్లిన కొద్దిరోజులకే రంగారెడ్డిని (Venkata ranga reddy ) ముగ్గులోకి దింపారు.
తమ వ్యవహారశైలితో ఆయనతో ఏకాంతంగా (Honey Trap) గడిపారు. ఆ సమయంలో ఆయనతో ఫొటోలు వీడియోలు తీసుకున్నారు.
ఆ తర్వాత అవి చూపించా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. మహిళలు ఆ వీడియోలను అమర్ కు పంపడంతో.. అమర్ వాటిని రంగారెడ్డికి పంపి బ్లాక్ మెయిల్ చేశాడు.

మొదట రూ.50 లక్షలు అడిగారు. దీంతో రూ.50 లక్షల విలువైన చెక్కులు ఇచ్చాడు. అక్కడితో వారి ఆశ తీరలేదు.
సమాజంలో పేరున్న వ్యక్తి.. వీడియోలు బయటకు వస్తే పరువు పోతుందని భావించి ఆయన రంగారెడ్డి కూడా భయపడిపోయాడు. అదే అక్రమార్కులకు అదనుగా మారింది.
ఈ సారి రెండుకోట్లకు ఎసరు పెట్టారు. అడిగింత అమౌంట్ ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించారు. దీంతో విసిగిపోయిన రంగారెడ్డి.. నేరుగా గోల్కొండ పోలీస్ స్టేషన్ కు (Golkonda police ) వెళ్లాడు. విషయం మొత్తం వారికి చెప్పాడు.

దీంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టి వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ చేశారు. డబ్బులు ఇస్తామని గోల్కొండకు రావాలని రంగారెడ్డితో నిందితులకు ఫోన్ చేయించారు.
డబ్బులు వస్తున్నాయన్న సంతోషంగా వారు ఎగేసుకుని వచ్చారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నట్టు గుర్తించారు. అమర్, మౌలాలి, రాజేష్ మంజుల, రజినిని అరెస్ట్ చేశారు.
వీరు గతంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారా అన్న యాంగిల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు.
Read Also :

