Breaking news : కాళేశ్వరం కేసులో సర్కారుకు మరో ఎదురుదెబ్బ..!

breaking news-batukamma

Breaking news : కాళేశ్వరం కేసులో సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని (Kaleshwaram project) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై రేవంత్ రెడ్డి సర్కారు.. పీసీ ఘోష్ కమిషన్(PC ghosh commission) వేసింది.

ఈ కమిషన్ రిపోర్టులో.. మాజీ సీఎం కేసీఆర్ (kcr)తో పాటు, మంత్రి హరీష్ రావు(harish rao), ఈటల రాజేందర్(eatala rajender) అలాగే పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అందులో మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషీ కూడా ఉన్నారు.

అయితే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తనపై చర్యలు తీసుకోవద్దని ఆయన హైకోర్టులో(highcourt of Telangana) గతంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు.. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎస్‌కే జోషిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Read Also :

పీసీ ఘోష్ కమిషన్ తనకు నోటీసులు ఇవ్వలేదని ఎస్ కే జోషి కోర్టుకు తెలిపారు. సాక్షిగా వాంగ్మూలం తీసుకుని నిందితుడిగా ఎలా చేరుస్తారంటూ ఆయన కోర్టులో కేసు వేశారు.

దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

 

Read Also :