Bandi Sanjay : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావాపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.
కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవన్ని కోర్టుల్లో నిలబడేవి కాదన్నారు. గతంలోనూ తనపై పరువునష్టం దావా వేశారని అది ఏమైందని ప్రశ్నించారు.
తాను కేసీఆర్ కుటుంబంపై పరువునష్టం కేసులు వేస్తే.. వాళ్లేవరూ బయట తిరగలేరని అన్నారు.
Read Also : బండి సంజయ్ పై కేసు పెట్టిన కేటీఆర్
కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) దగ్గర కోట్లకు కోట్ల రూపాయలున్నాయని.. వాటితో కోర్టుల్లో కేసులు వేస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.
“నువ్వు.. మీ అయ్య తిట్టని తిట్లు లేవు.. నేను ఇజ్జత్ దావా వేయలేనా.? ”
“లవంగం తింటే.. తంబాకు అన్నరు.. నేను ఇజ్జత్ దావా వేయలేనా.?”
“నన్ను వాడు వీడు అన్నవ్.. నేను ఇజ్జత్ దావా వేయలేనా.? ”
“మీ అయ్య నా తల్కాయ ఆరు ముక్కలు నరుతా అన్నడు.. నేను ఇజ్జత్ దావా వేయలేనా.? ”
“నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడిండు.. నేను ఇజ్జత్ దావా వేయలేనా.?”
“దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేశారు.. నేను ఇజ్జత్ దావా వేయలేనా.?”
“యువతకు ఉద్యోగాలని మోసం చేశారు.. నిరుద్యోగ భృతి అని మోసం చేశారు..” అని బండి సంజయ్ అన్నారు.
A silk-sofa neta hiding behind defamation cases can’t silence a street-fighter!
I was shaped by RSS, battled on the streets with ABVP, and fight for people with BJP. I’ve gone to jail 9 times, faced 100+ cases by BRS govt.
Blackmailing me? Good luck with that. pic.twitter.com/6f1OWDmenx— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 15, 2025
ఇలాంటి కేసులకు తాను భయపడబోనన్నారు. తన మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో 109కేసులు పెట్టారని.. 9 సార్లు జైలుకు పంపించారని చెప్పారు. తాను రాజకీయ నాయకుడినని.. అన్నింటిని రాజకీయంగానే ఎదుర్కుంటానని వెల్లడించారు.
తాను ఎక్కడా భూతులు మాట్లాడలేదన్నారు. ఆ విషయాన్ని కోర్టులో నిరూపించుకుంటానని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కునే దమ్ములేకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
తనను తంబాకు తింటాడని కేటీఆర్ అన్నారని.. అయితే తాను తినట్లేదని కుటుంబసభ్యులతో వచ్చి ప్రమాణం చేస్తానని సవాల్ చేశానన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోవడం లేదని కుటుంబసభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశానని తెలిపారు. కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
Read Alsoo :

