Kurnool lover : మహానటి సావిత్రిని మించిపోయింది..! ఏం చేసింది చూడండి.?

Kurnool wife killed her husband with help of lover

Kurnool lover : కర్నూలు జిల్లాలో మరో ఆస్కార్ నటి కథ బయటపడింది. భర్తకు ఖతం చేసి ఆస్కార్ లెవల్లో పర్ఫార్మెన్స్ చేసిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రియుడి మోజులో పడి.. ఆ మైకంలో భర్తను హత్య చేయించింది ఓ భార్య. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తగలుగల్లుకు చెందిన గొల్ల అహోబిలానికి గంగావతి అనే మహిళతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

కొద్దిరోజుల క్రితం వీరిద్దరు ఉపాధి కోసం కర్నాటక వెళ్లారు. అక్కడ గంగావతికి పాడు బుద్ధి పుట్టింది. కర్నాటకలోని రత్నడిగికి చెందిన చెన్నబసవ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు అన్ని రకాలుగా దగ్గరయ్యారు

ఇక రోజూ భర్త పనికి వెళ్లగానే ఇద్దరికి అదే పని. ప్రేమ పాఠాల్లో మునిగి తేలిపోయేవాళ్లు. అయితే.. ఇలా దొంగచాటుగా, భయం భయంగా ఎన్ని రోజులు కలుస్తాం.? ఏదో ఒకటి చేయాలని గంగావతి, చెన్నబసవ(Kurnool lover) మాట్లాడుకున్నారు.

ఎలాగైనా అహోబిలాన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికోసం పెద్ద ప్లానే వేశారు. కర్నాటకలోనే చంపేస్తే తన ప్రియుడికి మీదకు వస్తుందని  ఓ ప్రణాళిక వేశారు.

కొద్దిరోజుల తర్వాత మేం సొంతూరికి వెళ్తాం. అక్కడికి వచ్చి పని  కానిచ్చేయ్ అని ప్రియుడికి చెప్పింది గంగావతి. అనుకున్నట్టుగానే ఇటీవల భార్యాభర్తలిద్దరు సొంతూరికి వచ్చారు. రాగానే అదను చూసి ప్రియుడికి సమాచారం చేరవేసింది.

కర్నాటక నుండి వచ్చిన ప్రియుడు, మరికొందరు అహోబిలాన్ని కత్తితో పొడిచి చంపేశారు. అక్కడి నుండి పరారయ్యారు.

పని పూర్తయ్యింది. అహోబిలం చనిపోయాడని చెన్న బసవ చెప్పగానే గంగావతి సంబరపడిపోయింది. ఇక ప్రియుడితో హాయిగా, సంతోషంగా ఉండొచ్చునని అనుకుంది.

అలాగని భర్త చనిపోయినా నవ్వుతూ ఉండలేదు కదా. అందుకే ఆస్కార్ లెవల్లో పర్ఫార్మెన్స్ చేసింది. తన భర్తను పొట్టనపెట్టుకున్నారంటూ గుండెలు బాదుకుంటూ రోధించింది. పాపం.. ఎంత అన్యోన్య దాంపత్యమోనని అంతా ఆవేధన చెందారు.

కానీ పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మొగుడిని వేసేయడానికి అంతా సిద్ధం చేసి.. మొగుడిని చంపించి..  ఇప్పుడేమో ఇలా ఏడుపు నడిస్తోందని తెలిసిపోయింది.

అటు ప్రియుడిని, ఇటు ప్రియురాలిని.. ఇద్దరిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.

..

Read Also :