Formula E : ఫార్ములా రేసులో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఇవాళ మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ కేసుకు సంబందించి సర్కారుకు ఏసీబీ… రిపోర్ట్ ఇచ్చింది. ఫార్ములా E ఆపరేషన్స్(Formula E) నుండి బీఆర్ఎస్ కు రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని రిపోర్ట్ లో చెప్పినట్టు తెలుస్తోంది.
ఫార్ములా E ఆపరేషన్స్ కు ప్రభుత్వ నిధులు ఇచ్చినందుకే.. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని ఏసీబీ రిపోర్ట్ లో వెల్లడించినట్టు సమాచారం.
దీంతో కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ పై చర్యల కోసం గవర్నర్ ను ఏసీబీ అనుమతి కోరినట్టుగా చెబుతున్నారు. గవర్నర్ అనుమతి ఇస్తే చార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంది.
అయితే.. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇదొక లొట్టపీసు కేసు అని మరోసారి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు.
హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకోసం… మేం ప్రభుత్వం నుండి డబ్బులు పంపామని చెబుతున్నాం..
నేనే అనుమతి ఇచ్చా అని చెబుతున్నా..
ఇందులో అవినీతి ఎక్కడుంది…?
లైవ్ లో లై డిటెక్టర్ టెస్ట్ కు రెడీ
రేవంత్ రెడ్డి వస్తవా.?..కేటీఆర్ https://t.co/ttyfpBZ0Ql pic.twitter.com/gwkWz7Bs63
— Prabhakar Venavanka (@Prabhavenavanka) September 9, 2025
ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్ కు కూడా తాను సిద్దమని కేటీఆర్ ప్రకటించారు.
Read Also :

