Vice President : రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఎ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. లోక్‌సభలో543 మంది ఎంపీలు(ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) రాజ్యసభలో 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీ) ఉన్నారు.
బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి లోక్ సభలో 293 మంది సభ్యుల మద్దతు ఉంది. అటు ఇండియా కూటమికి లోక్ సభలో 204 మంది సభ్యుల మద్దతు ఉంది.
రాజ్యసభలో NDA బలం 133 కాగా ఇండియా కూటమి బలం 77.. మొత్తం ఉమ్మడి సభలు కలిపి 781 కాగా గెలుపుకు391 ఓట్లు కావాలి. ఈ లెక్కన చూస్తే ఎన్డీఏ అభ్యర్థికి.. 293+133=426 (వైసీపీ-11, ఇండిపెండెంట్లు) బలం ఉందని చెప్పాలి.
ఇండియా కూటమికి.. 204+77=281 (ఎంఐఎం-1, ఆప్-4) బలం ఉంది. రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ ఎంపీలు ఉంటారు. బీఆర్ఎస్(-4), బీజేడీ(7) ఎన్నికకు దూరంగా ఉంది. ఇందులో ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగితే రిజల్ట్ మారుతుంది తప్ప.. దాదాపుగా ఉపరాష్ట్రపతిగా ఎన్డీఎ అభ్యర్థి గెలిచే అవకాశమే ఎక్కువ.
Read Also :

