Telugu media : ఫ్రంట్ పేజీ సాక్షిగా.. ఇజ్జత్ తీసుకున్న పేపర్లు..!

Telugu media true face exposed

Telugu media : మీడియా అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. వార్తలను ప్రజలకు చేరవేయాలి. నిజాలు చెప్పాలి. నిజాలు రాయాలి.

కానీ ప్రస్తుతం మీడియా మొత్తం బయాస్డ్ గా మారిపోయింది. ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక వ్యక్తికో అనుకూలంగా ఉండటం సాధారణం అయిపోయింది. సాధారణంగా ఎవరు అధికారంలో ఉంటే.. వారికి మీడియా వంతపాడుతుంది.

కానీ తెలంగాణలో భిన్నమైన పరిస్థితి గత ప్రభుత్వ హాయంలో ప్రతిపక్షం వైపు ఉన్న మీడియా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అదే పార్టీ వైపు నిలబడింది.

మేం అధికార పక్షం వైపే ఉంటామని తమ పేపర్ల ఫ్రంట్ పేజీల సాక్షిగా ప్రకటించుకుంది. మేమింతే.. మమ్మల్ని ఏం అడగొద్దు.. మమ్మల్ని ప్రశ్నించొద్దు. మేం బరాబర్ సర్కారు పత్రికలమే అని నిరూపించుకున్నాయి.

రెగ్యులర్ గా వాళ్లు చేసే పని అదే అయినా.. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే..

8వ తేదీ అంటే సోమవారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మల్లన్నసాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని చెప్పారు. రూ.1100 కోట్ల నుండి రూ.7 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.

డ్రగ్స్ ఇష్యూలో మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టునే దాక రాష్ట్ర పోలీసులకు కనీస సమాచారం లేకపోవడంపైనా విమర్శలు చేశారు.

చివరలో ప్రెస్ మీట్ ముగింపులో ఆయన కొన్ని మాటలు చెప్పారు. మీరు నేను చెప్పిన అవినీతి గురించి రాయండి. పక్కన పడేయకండి. మీపై, మీ యాజమాన్యాలపై ఒత్తిడి ఉండొచ్చు. ఏ మీడియా సంస్థ సర్కారుకు అండగా ఉంది..? ఏ మీడియా వాస్తవాలు చూపిస్తోందనేది… మీరు రాసే వార్తలను ద్వారా తెలిసిపోతుందని కూడా చెప్పారు.

అంటే ఏ సంస్థ వాస్తవాలు చెబుతోంది..? ఏ సంస్థ సర్కారును కాపాడుతోందనేది కూడా తెలిసిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.

అలా చెప్పాక అయినా మీడియా.. కాస్త బుద్ధితెచ్చుకోవాలి కదా.

కానీ ఏం చేసింది..?

“నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు” అన్నట్టు అదే పని చేశాయి.  అసలు విషయాన్ని పక్కనపెట్టి.. కొసరు విషయాన్ని వండి వర్చాయి. పాత విషయాన్నే మళ్లీ చెప్పాయి. ఆంధ్రజ్యోతి అయితే మరో అడుగు ముందుకేసి కవిత అంశాన్ని హెడ్ లైన్ గా పెట్టింది.

తెలంగాణలో గత పదేళ్లు కూడా మీడియా ఒక పార్టీ ఎజెండాను ఎలా అమలు చేసింది? ఎలా వాస్తవాలను వక్రీకరించింది అనేదానికి ఇదే నిదర్శనం.

ఇదీ మన మీడియా.. కాదు కాదు.. సర్కారు ప్రచార మీడియా సంస్థల పరిస్థితి.

Read Also :