Sri Chaitanya : శ్రీచైతన్య స్కూల్‌లో ర్యాగింగ్

Sri Chaitanya : కోనసీమ జిల్లా రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూల్‌లో ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. పదవ తరగతి విద్యార్థి ప్రసాద్ (16)పై తోటి విద్యార్థులు క్రూరంగా వ్యవహరించారు. అతని పొట్ట, చేతులపై వేడెక్కిన ఐరన్ బాక్స్‌తో కాల్చి గాయపరిచారు.

కొడుకును చూసేందుకు హాస్టల్‌కు వెళ్లిన తల్లి, అతని శరీరంపై గాయాలను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.

ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Read Also :