Nandyala Police: వురే ఏంట్రా మీరు.? పోలీసుల ఫొటోలే మార్ఫింగా..!?

nandyala police photos morphed

Nandyala Police : ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కొందరు పోకిరిగాళ్లు ఏకంగా పోలీసుల ఫొటోలనే మార్ఫింగ్ చేశారు. నంద్యాల జిల్లా  కోయిలకుంట్లలో (koilakuntla) ఈ ఘటన జరిగింది. ఏకంగా పోలీసుల ఫొటోలు  మార్ఫింగ్ కావడం రాష్ట్రంలో  సంచలనంగా మారింది.

కోయిలకుంట్లలో  పోలీస్ స్టేషన్ లోని (Nandyala Police)సీఐ, ఎస్సైల ఫొటోలను మార్ఫింగ్ చేశారు.  ఆగస్ట్ నెలలో వీటిని అప్ లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది.

koilakuntla police koilakuntla police

ఇందులోనూ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వారు మార్ఫింగ్ చేసింది మగ పోలీసుల ఫొటోలను. పోలీసు యూనిఫాం తీసేసి చీరెలు కట్టుకున్నట్టుగా వాటిని మార్ఫింగ్ చేశారు. Shiva412668 ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో ఈ ఫొటోలు పెట్టినట్టు గుర్తించారు.

koilakuntla police koilakuntla police

Read Also :

ప్రస్తుతం ఆ ఐడీ క్రియేట్ చేసిన వ్యక్తిని గుర్తించి ఫొటోలు డిలీట్ చేశారు. ఆ అకౌంట్ కూడా ఈ ఏడాది జులైలోనే క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. దీనికి కారణం ఏంటనే దానిపై ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

koilakuntla police

ఏవైనా రాజకీయ కారణాలున్నాయా.? లేకపోతే అవినీతి చేయడంతో ఎవరైనా కోపంతో ఇలా చేశారా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఆ ఫొటోలు అప్ లోడ్ చేసిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.