Fatty Liver:లివర్‌ వ్యాధులపై కొత్త మందు..

Fatty Liver:అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా సాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఫ్యాటీ లివర్ వ్యాధి తీవ్రమైన రూపమైన MASH (Metabolic dysfunction-associated steatohepatitis) చికిత్స కోసం కొత్త మందును గుర్తించారు.

ఇది ప్రధానంగా ఒబేసిటీ (అధిక బరువు) మరియు టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే వ్యాధి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ కూడా వస్తాయి. ఈ వ్యాధి ఎక్కువ కాలం లక్షణాలు కనిపించకుండా మెల్లగా పెరుగుతుంది కాబట్టి దీన్ని “సైలెంట్ డిసీజ్” అని కూడా అంటారు.

ది లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో ION224 అనే మందు ఉపయోగించారు. ఈ మందు లివర్‌లో కొవ్వు తయారుచేసే DGAT2 ఎంజైమ్ ను అడ్డుకుంటుంది. దాంతో లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం, వాపు తగ్గుతాయి. ఇవే MASH వ్యాధికి ప్రధాన కారణాలు.

అమెరికాలో 160 మంది రోగులపై ఒక సంవత్సరం పాటు పరిశోధన జరిగింది. రోగులకు నెలకు ఒకసారి ఇంజెక్షన్ రూపంలో మందు ఇచ్చారు. అత్యధిక మోతాదు తీసుకున్న రోగులలో 60% మందికి లివర్ ఆరోగ్యంలో మంచి మెరుగుదల వచ్చింది. ఆశ్చర్యకరంగా, బరువులో మార్పు లేకపోయినా లివర్ పరిస్థితి మెరుగుపడింది.

ఈ మందు వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రాలేదు. ఇది రోగులకు మరింత నమ్మకం కలిగిస్తోంది.ప్రస్తుతం అమెరికాలో 10 కోట్ల మందికి పైగా ఫ్యాటీ లివర్ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని అంచనా.

ఈ ఫలితాలు ఫేజ్ III ట్రయల్స్‌లో కూడా వస్తే, రోగులకు కొత్త మందుతో చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇది వ్యాధి తీవ్రమయ్యే ముందే ఆపుతుంది అన్నారు.

ఈ పరిశోధనతో MASH బాధపడుతున్న వారికి కొత్త ఆశలు కలిశాయి.

Read Also :