Heart Attack:హార్ట్‌అటాక్‌కు అసలు కారణం ఇన్ఫెక్షనా…?

heart attack reasons

Heart Attack:హార్ట్‌అటాక్ అంటే మనకి సాధారణంగా గుర్తుకు వచ్చేది అధిక కొలెస్ట్రాల్, తప్పు జీవనశైలి, పొగ త్రాగడం, ఒత్తిడి వంటి కారణాలే. కానీ తాజాగా ఫిన్లాండ్, యూకే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఇన్ఫెక్షన్ కూడా హార్ట్‌అటాక్‌కు కారణం అవుతుందని పెద్ద ఆధారం బయటపడింది.

శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏమిటంటే – మన హృదయానికి రక్తం సరఫరా చేసే ఆర్టరీల్లో ఏర్పడే ప్లాక్‌లలో చిన్న బ్యాక్టీరియా బయోఫిల్మ్‌లు దశాబ్దాల పాటు నిశ్చలంగా దాగి ఉంటాయి. ఇవి శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌కి కూడా, యాంటీబయాటిక్స్‌కి కూడా కనిపించవు.

కాని ఒకసారి శరీరానికి వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే లేదా మరో బాహ్య కారణం తాకితే, ఈ బ్యాక్టీరియా అకస్మాత్తుగా యాక్టివ్ అవుతుంది.

యాక్టివ్ అయిన వెంటనే ఇవి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతాయి. దీంతో ప్లాక్ చిట్లిపోగా రక్తప్రవాహం ఆగిపోతుంది. అదే హార్ట్‌అటాక్.

ఇంతకాలం వరకు హార్ట్ వ్యాధులు కేవలం కొలెస్ట్రాల్ వల్లే వస్తాయని భావించారు. కానీ ఈ అధ్యయనం ద్వారా మొదటిసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా హార్ట్‌అటాక్ వస్తుంది అని నిర్ధారణకు వచ్చారు.

పరిశోధకులు ఆర్టరీ టిష్యూ నమూనాలలో నోటి బ్యాక్టీరియా DNA కూడా కనుగొన్నారు. ఇవే బయోఫిల్మ్‌లలో దాక్కుని, సరైన సమయంలో బయటకు వచ్చి హార్ట్‌అటాక్‌కు కారణమయ్యాయని రుజువైంది.

ఈ పరిశోధన ఫిన్లాండ్‌లోని టాంపెరె, ఓలూ యూనివర్శిటీలు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, Finnish Institute for Health and Welfare కలిసి చేశారు. 11 దేశాలు పాల్గొన్న భారీ యూరోపియన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇది జరిగింది.

Read Also :

ప్రభావం ఏమిటంటే: ఇకపై హార్ట్‌అటాక్‌ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్ దారులు పూర్తిగా మారవచ్చు. భవిష్యత్తులో వ్యాక్సిన్ రూపంలో హార్ట్ వ్యాధిని నివారించే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.