Nupur Bora : వామ్మో… ఈ ఐఏఎస్ మామూలుది కాదు..!

Assam top ias officer nupur bora caught by Special Vigilance

Nupur Bora : అస్సాంలో ఒక యువ ఐఏఎస్ అధికారిణి నుపుర్ బోరా(Nupur Bora) అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఆమె ఇంటిపై స్పెషల్ విజిలెన్స్ టీములు దాడి చేశాయి.

దాడుల సమయంలో ఆమె ఇంట్లో రూ. 92లక్షల నగదు. కోటి రూపాయల విలువైన నగలు దొరికాయి. తాను అద్దెకు ఉంటున్న మరో ఇంట్లో రూ.10 లక్షలు దొరికాయి.

అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె 2019 బ్యాచ్ కు చెందిన అధికారిణి. ఆమె ఇంట్లో రెయిడ్స్ చేస్తే రూ.92 కోట్ల నగదు, కోటిరూపాయల విలువైన నగలు దొరికాయి.

లాకర్లలో కూడా నగదు, భూములకు సంబంధించిన పత్రాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు.

అంటే ఇప్పుడే దాదాపు రూ.2కోట్ల వరకు దొరికాయి. ఇక లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెన్ని కోట్లు దొరుకుతాయోనని అంతా ఆశ్చర్యపోతున్నారు.

కేవలం డ్యూటీలో చేరిన 6 ఏళ్లలోనే ఇంతలా సంపాదించిందంటే.. పూర్తి సర్వీస్ అయిపోయే వరకు బంగారంతోనే ఇళ్లు కట్టేస్తుంది కావొచ్చని అంటున్నారు.

IAS Nupur bora

అయితే.. నుపుర బోరా అస్సాంలోని గోలాఘాట్ కు చెందిన వారు. ప్రస్తుతం గొరొయ్ మరి సర్కిల్ ఆఫీసర్ గా ఉన్నారు.

అయితే ఆమె హిందువులకు సంబంధించిన భూములు వేరేవాళ్లకు బదలాయించి భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా ఆపరేట్ చేస్తున్న విజిలెన్స్ టీములతో నిఘా పెట్టారు. దీంతో ఆమె దొరికిపోయారు.

Read Also :

ఆమె చాలా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే ఆమె రీల్స్ కూడా చేస్తుంటారు. తన వీడియోల్లో ఇంటి పరిసరాలు చూసినవాళ్లు.. ఇంత రిచ్ హౌసా అని ఆశ్చర్యపోతున్నారు.

కానీ ఒక అధికారి ఇంత తక్కువకాలంలో అంతలా సంపాదించారంటే.. ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మన తెలంగాణలో కూడా చాలా మంది ఇలాంటి అధికారులు ప్రతినిత్యం పట్టుబడుతూనే  ఉన్నారు. ఇక్కడ కూడా ఐఏఎస్ అధికారుల చరిత్ర తవ్వితే ఇలాంటివాళ్లు చాలామంది దొరికిపోతారని అంటున్నారు.