CP Radhakrishnan : సీపీ రాధాకృష్ణన్ రాజీనామా..!

breaking news

CP Radhakrishnan : భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు.

దీంతో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవవ్రత్ ఆగస్టు 2015 నుండి జూలై 2019 వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

జూలై 2019 నుండి గుజరాత్ గవర్నర్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 9న జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు.

CP Radhakrishnan: India elects new vice-president

ఈ ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. కాగా ​సి.పి. రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా 2025 సెప్టెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారులు వెల్లడించారు.రాధాకృష్ణన్ ఈ పదవిని చేపట్టిన తమిళనాడు నుండి మూడో వ్యక్తి.

Read Also :