Sulthanpur : ప్రేమ వ్యవహారాలు కుటుంబాలను నాశనం చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఇతరులతో సంబంధాలు పెట్టుకుని భర్తలను భార్యలు కడతేరుస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఇది వేరే లెవల్ ఘటన.
సూల్తాన్ పూర్ సమీపంలోని కిండిపూర్ కు చెందిన పూజ, మహేష్ భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. మహేష్ లుదియానాలో పనిచేసేవాడు. అక్కడే ఉండి.. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు.
ఈ గ్యాప్ లో పూజకు జైశంకర్ అనే మరో వ్యక్తితో సంబంధం ఏర్పడింది. భర్త కూడా ఇంట్లో లేకపోవడంతో వీరి ప్రేమ కలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
Read Also :
- కవితపై హరీష్ రావు సంచలన రియాక్షన్
- 15 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి
- ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!
- కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
- చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ..!
అయితే కొద్ది రోజులుగా భర్త మహేష్.. ఊర్లోనే ఉంటున్నారు. దీంతో వీరిద్దరు కలవడం వీలు కావడం లేదు. అతనికి కూడా విషయం తెలియడంతో పలుమార్లు గొడవలు కూడా అయ్యాయి. దీంతో ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు.
బుధవారం సాయంత్రం మహేష్.. కోడి గానీ, చేపలు గాని తీసుకొస్తానని బయటకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన పూజ.. తన ప్రియుడు జైశంకర్ కు సమాచారం చేరవేసింది. అతడు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పింది.

అక్కడికి వెళ్లిన జై శంకర్.. మహేష్ కు ఫుల్లుగా మద్యం తాగించాడు. పూర్తిగా స్పృహ తప్పే వరకు మందు తాగించాడు. ఇంటికి తీసుకెళ్తానని తనతో పాటు తీసుకెళ్లాడు. మధ్యలో ఒక తోట దగ్గర అతడిని కింద పడేశాడు.
పూజకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపట్లోనే పూజ (puja)కూడా అక్కడికి చేరుకుంది. ఆమె ముందే జైశంకర్ తన దగ్గరున్న కత్తితో మహేష్ గొంతు కోశాడు. పూజ.. ఒక ఇటుక తీసుకుని భర్త ఛాతిపై పదే పదే కొట్టింది. అతను ప్రాణాలు వదిలాడని నిర్దారించుకుని అక్కడి నుండి ఇద్దరు వెళ్లిపోయారు.
అక్కడి నుండి అసలు డ్రామా మొదలు పెట్టారు.
రక్తం మరకలున్న బట్టలను దొరకకుండా పడేశారు.
తెల్లవారగానే.. ఏమీ తెలియనట్టు పూజ హడావుడి హడావుడి చేసింది. తన భర్త (Sulthanpur) కనిపించడం లేదని ఆగమాగం చేసింది. చివరకు హత్యకు గురయ్యాడని తెలియడంతో గుండెలు బాదుకుంటూ రోధించింది.

ఆమె ఏడుపు చూసి.. అక్కడున్న వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఓ వైపు ఈ డ్రామా నడుస్తూ ఉండగానే పోలీసులు.. పూజ కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. ప్రియుడు జైశంకర్ తో ఆ రోజు దాదాపు 20 సార్లు మాట్లాడినట్టు గుర్తించారు. వెంటనే వెళ్లి అతడిని అరెస్ట్ చేసి నాలుగు బాదడంతో విషయం చెప్పేశాడు.
దీంతో వెంటనే వచ్చి శవం ముందు నుండే పూజను పోలీసులు లాక్కెళ్లారు. భర్తను పూజనే హత్య చేసిందని చెప్పారు.
దీంతో అక్కడున్న వాళ్లంతా కళ్లు తేలేశారు. ఇప్పటి దాకా ఇంతలా ఏడ్చింది. ఆమెనే చంపేసిందా అని షాక్ అయ్యారు.
ప్రస్తుతం వారిద్దరు వేర్వేరు జైళ్లలో ప్రేమ జ్ఞాపకాలతో బంధీలయ్యారు.
..

