Revanth reddy : నిజాం పాలన నుండి హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసి సందర్భంగా ప్రజాపాలన దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి అన్న ఆయన.. డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలు రాయిగా చెప్పారు. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని తాము పరిపాలన చేస్తున్నట్టు చెప్పరు.
తమకు అహంకారపు ఆలోచనలు లేవని, బంధు ప్రీతి లేదని, ఆశ్రిత పక్షపాతానికి తావు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.
Read Also :
- మెదడును తినేస్తున్న కొత్త రోగం
- సొంత జిల్లాకు వెళ్లాలంటే జంకుతున్న మంత్రి..?
- అమ్రపాలి ఇంకా ఏపీలోనే..!
- లవంగం తింటే తంబాకు అన్నరు:బండి సంజయ్
తమ నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం కూడా ఇస్తున్నామని చెప్పారు. తప్పులుంటే దిద్దుకుంటున్నామని.. మంచి చేయడమే బాధ్యతగా తాము పని చేస్తున్నామని చెప్పారు.
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం తాము రూపొందించిన పథకాలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయన్నారు.
రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసినట్టు చెప్పారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడటం లేదన్నారు. తొలి 20 నెలల్లోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.
భవిష్యత్తులో మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది
మాకు బుల్లెట్ ట్రైన్లు కావాలని మోడీని అడిగాను
ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి అక్కడి నుండి చెన్నైకి, అటు నుండి బెంగళూరుకు వెళ్ళి తిరిగి ఫ్యూచర్ సిటీకి వచ్చేలా బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగాను – రేవంత్ రెడ్డి pic.twitter.com/uOuFOmXY0q
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2025
కృష్ణా, గోదావరి నదుల్లో మన రాష్ట్ర వాటానుఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని తెలిపారు. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించేలా వ్యూహాలు రచిస్తున్నామన్నారు.
మూసీ పరివాహక ప్రాంతం నైట్ ఎకానమీ కొనసాగించేలా తీర్చిదిద్దుతామన్నారు. డిసెంబర్ 9 నాడు మూసీ పునరుజ్జీవ ప్రణాళికలు ప్రకటిస్తామన్నారు.
ఇక ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి బుల్లెట్ రైలు కావాలని మోడీని అడిగినట్టు చెప్పారు. ఇటీవల అధికారులు కూడా దానిని పరిశీలించారన్నారు.

